మట్టిలో మాణిక్యంలా సల్మాన్...ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

ప్రస్తుతం కరోనా ఇండియా మొత్తాన్ని వణికిస్తోంది. సినిమా వాళ్ళకి షూట్ పర్మిషన్ లు ఇచ్చిన రోజూ నమోదవుతున్న వేల కేసుల నేపధ్యంలో పెద్దగా షూట్స్ కు వెళ్ళడం లేదు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తన సమయాన్ని తన పన్వేల్ ఫాం హౌజ్ లోనే గడుపుతున్నాడు. ఈయన కరోనా మొదలయిన కొత్తలో కొన్ని సేవా కార్యక్రమాలు చేసిన ఆయన అనంతరం పూర్తిగా ఫాంహౌస్ కే పరిమితం అయిపోయాడు. ఇక తాజాగా సల్మాన్ ఫాం హౌజ్‌లోని పొలంలో వ్యవసాయ క్షేత్రంలో సల్మాన్ నాటు వేస్తున్న ఫోటో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తినేవాడి పేరు ధాన్యం మీద రాసి ఉంటుంది. జై జవాన్ జై కిసాన్ అంటూ ఆ ఫొటోకి క్యాప్షన్ కూడా ఇచ్చాడు సల్లూభాయ్. ఇక తాజాగా కూడా సల్మాన్ ఒళ్లంతా బురద అంటుకుని ఉండగా తీసిన స్టిల్ ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఈ ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన సల్మాన్..రైతులందరినీ గౌరవించండి అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ఈయన పిక్స్ మీద గట్టిగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఒక్కడులో బురదలో కూర్చున్న ప్రకాష్ రాజ్ పిక్స్ ను ఈ పిక్ పక్కన పెట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు.