సుజిత్ చేతి నుండి చేజారిన లూసిఫర్...వినాయక్ చేతికి

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ఆచార్య. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ సినిమా మీద భారీ ఆంచనాలున్నాయి. అయితే ఈ సినిమా బాగా లేటయిందని చెప్పచ్చు. అందుకేనేమో ఇది పూర్తి అవగానే చేయడానికి ఇప్పటి నుండే వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు చిరంజీవి. ఇప్పటికే ఆయన ముగ్గురు దర్శకులను తన నెక్స్ట్ మూవీ కొరకు లైన్ లో పెట్టారు. మెహర్ రమేష్, బాబీ అలాగే సుజీత్ తో కథా చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు కూడా. సుజీత్ కి ఆయన మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ బాధ్యతలు అప్పగించారు. ఆ స్క్రిప్ట్ పై ప్రస్తుతం సుజీత్ పని చేస్తున్నారు.
అయితే ఈ సినిమాకి సంబంధించి మరో వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే సుజిత్ రాసిన స్ర్కిప్ట్ తో చిరు సంతృప్తి చెందలేదట. అందుకే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని అనుభవమున్న డైరెక్టర్ తో చేయాలని చిరు ఫిక్స్ అయ్యాడని అంటున్నారు. ఠాగూర్, ఖైదీ నంబర్ 150 సినిమాలతో తనకు బ్లాక్ బాస్టర్ హిట్ లు ఇచ్చిన వివి వినాయక్ ఈ మూవీని అప్పగించాలని భావిస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇందులో నిజం ఎంత ఉందనేది తెలియాల్సి ఉంది.