English   

చరణ్ ప్లేస్ లో రానా...నిజమేనా 

Rana daggubati
2020-07-15 16:56:28

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ఆచార్య. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ సినిమా మీద భారీ ఆంచనాలున్నాయి. అయితే ఈ సినిమా బాగా లేటయిందని చెప్పచ్చు. అందుకేనేమో ఇది పూర్తి అవగానే చేయడానికి ఇప్పటి నుండే వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు చిరంజీవి. ఇప్పటికే ఆయన ముగ్గురు దర్శకులను తన నెక్స్ట్ మూవీ కొరకు లైన్ లో పెట్టారు. మెహర్ రమేష్, బాబీ అలాగే సుజీత్ తో కథా చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు కూడా. సుజీత్ కి ఆయన మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ బాధ్యతలు అప్పగించారు. ఆ స్క్రిప్ట్ పై ప్రస్తుతం సుజీత్ పని చేస్తున్నారు. దీనిని పూర్తి స్థాయి తెలుగు సినిమాగా తీర్చి దిద్దే పనిలో పడ్డాడట సుజీత్. 

ఇక ఆచార్య సినిమాలో ఓ కీలక పాత్రకు సంబందించి ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి. ముందు ఈ పాత్రలో మహేష్ నటిస్తున్నాడని కొన్నాళ్ళు లేదు పవన్ కళ్యాణ్ అని మరో రూమర్ కూడా నడిచింది. చివరగా రామ్ చరణ్ ఆ కీలక పాత్రలో నటిస్తున్నాడంటూ లీకులు ఇచ్చారు. అయితే తాజాగా ఇప్పుడు ఆ కరోనా కారణంగా ఆర్ఆర్ఆర్ షూట్ వాయిదా పడడంతో ఆచార్య మూవీలో చరణ్ నటించడం కష్టమే అంటున్నారు. దీనితో అనేక మంది నటుల పేర్లు తెరపైకి వస్తున్నాయట. అందులో భాగంగా క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ పేరు వినిపించగా ఇప్పుడు తాజాగా రానా పేరు తెరపైకి వచ్చింది. రానా చిరంజీవి ఆచార్యలో నటిస్తున్నాడంటూ ఓ వార్త హల్ చల్ చేస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజుల ఆగాల్సిందే.  

More Related Stories