హెబ్బా హెబ్బా అందం దెబ్బ తగిలిందోయబ్బా.. అబ్బా హాయ్రబ్బా..

ఇప్పుడు హెబ్బా పటేల్ ను మరీ ఇంత బోల్డుగా చూస్తుంటే ఈ పాటే పాడాలనిపిస్తుంది. నిజంగానే ఈమె అందం దెబ్బకు కళ్లు బైర్లు గమ్మేస్తున్నాయి. కొన్ని రోజులుగా కనిపించడం మానేసిన హెబ్బా పటేల్.. ఇప్పుడు అవకాశాల కోసం వేచి చూస్తుంది. కుమారి 21 ఎఫ్ తో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ దానికి ముందే ఓ సినిమా చేసింది కానీ అది ఎవరికీ పెద్దగా తెలియదు. కుమారి తర్వాత ఇప్పటి వరకు మరో హిట్ లేదు ఈ భామకు. ఎక్కడికి పోతావు చిన్నవాడా హిట్టైనా కూడా అందులో నందితా శ్వేతా క్రెడిట్ అంతా పట్టుకుపోయింది. మధ్యలో కొన్ని సినిమాలు చేసినా కూడా ఏది పెద్దగా క్లిక్ అవ్వలేదు. వరుణ్ తేజ్ లాంటి క్రేజీ హీరోలతో నటించినా హెబ్బాకు ఒరిగిందేమీ లేదు. పైగా అమ్మాయిగారు ఆంటీలా మారిపోయారు ఈ మధ్య. భయంకరంగా బరువు పెరిగిపోవడంతో హెబ్బాకు అవకాశాలే రావట్లేదు.
దాంతో ఫిజిక్ పై బాగా సీరియస్ గా దృష్టి పెట్టింది ఈ కుమారి. దీనికి ఫలితం ఇప్పుడు కనిపిస్తుంది. గతంతో పోలిస్తే చాలా బరువు తగ్గిపోయింది ఈ భామ. పైగా అందాలు ఆరబోస్తూ తాజాగా ఓ ఫోటోషూట్ కూడా చేసింది. ఆ మధ్య 24 కిస్సెస్ సినిమాలో 24 ముద్దులు పెట్టినా కూడా వర్కవుట్ కాలేదు. దాంతో హాట్ షోపై ఆధారపడుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇది చూసిన తర్వాత కచ్చితంగా హెబ్బాకు మళ్లీ అవకాశాలు రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా సినిమాలో ఓ పాత్ర.. రామ్ రెడ్ సినిమాలో ఐటం సాంగ్ చేసింది హెబ్బా పటేల్. మరి చూడాలిక. ఏం జరుగుతుందో..?