పవన్ కళ్యాణ్ అద్భుతమైన నటుడు అంటున్న వర్మ..

అదేంటి.. అంత సడన్ గా ప్లేట్ ఫిరాయించాడు అనుకుంటున్నారా..? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. అక్కడున్నది ఎవరు.. వర్మ.. రామ్ గోపాల్ వర్మ.. ఎడారిలో ఇసుక అమ్మే రకం అది. అలాంటి దర్శకుడు అంత ఈజీగా పవన్ కళ్యాణ్ ను ఎందుకు పొగుడుతాడు..? అందులోనూ మతలబు ఉంది. ప్రస్తుతం ఈ దర్శకుడు ‘పవర్ స్టార్’ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా పూర్తైపోయింది. జులై 24న ఈ సినిమా విడుదల కానుంది కూడా. అదే రోజు ఎందుకు అంటే 22 ఏళ్ల కింద పవన్ కెరీర్ ను మార్చేసిన తొలి ప్రేమ ఆ రోజే విడుదలైంది కాబట్టి ఇప్పుడు తన పవర్ స్టార్ ను కూడా అదే రోజు విడుదల చేయబోతున్నాడు వర్మ. తన ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో విడుదల చేయబోతున్నాడు ఈ దర్శకుడు.
ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోగా నటించిన నటుడిని ఓ రేంజ్ లో పొగిడేసాడు ఆర్జీవీ. పవర్ స్టార్ సినిమాలో ఉన్న పవన్ కళ్యాణ్ అద్భుతమైన నటుడు.. ఏ పవర్ ఫుల్ స్టార్ కూడా ఈయన నటన ముందు పనికిరాడు అంటూ వెక్కిరించాడు వర్మ. సినిమాలో పవర్ స్టార్ ను పొగుడుతూ రియల్ పవన్ కళ్యాణ్ ను హేళన చేసాడు ఈ దర్శకుడు. ఇది చూసిన తర్వాత ఫ్యాన్స్ కు ఎక్కడలేని మంట పుడుతుంది. మరోవైపు పవన్ మాత్రం వర్మను చాలా లైట్ తీసుకున్నాడు. ఆయనేం చేసినా పట్టించుకోవద్దు అంటూ ఫ్యాన్స్ ను కూడా కోరుతున్నాడు ఈ హీరో. ఇదిలా ఉంటే వర్మ ప్రస్తుతం ‘మర్డర్’ , ‘కరోనా వైరస్’, ‘ది మ్యాన్ హూ కిల్డ్ గాంధీ’, ‘కిడ్నాప్ ఆఫ్ కత్రినా కైఫ్’ చిత్రాలను తెరకెక్కిస్తున్నాడు.