వనిత మూడో పెళ్లి .. ఆ నిర్మాత మీద కేసు

కోలీవుడ్ నటి, ఒకప్పటి హీరోయిన్ వనిత విజయ్ కుమార్ ఇటీవల చేసుకున్న వివాహం తమిళనాట రచ్చ రేపుతోంది. ఆమె పీటర్ పాల్ అనే వ్యక్తిని వివాహం చేసుకోగా ఆమెపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకో కానీ సాధారణ ప్రజలతో పాటు సినీ ప్రముఖులు కూడా వనిత మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే తన మీద విమర్శలు చేసిన వారికి వనిత ఘాటుగానే సమాధానం ఇచ్చింది. ట్విటర్ వేదికగా తనపై విమర్శలు చేసిన వారికి కౌంటర్ ఇస్తూ వస్తోంది. అయితే వనిత ఎంతలా కౌంటర్ ఇచ్చినా విమర్శలు ఆగకపోవటంతో చట్టపరమైన చర్యలకు దిగితే కానీ వర్కౌట్ కాదని భావించిన వనిత తాజాగా తనపై విమర్శలు చేసేవారిపై పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇచ్చింది. పోరూర్ పోలీస్ స్టేషన్లో నిర్మాత రవీంద్రన్తో పాటు సూర్యదేవి పైన తన లాయర్ తో కలిసి ఫిర్యాదు చేసింది. సూర్యదేవి అనే ఆమె వనిత మూడో పెళ్లి చేసుకోవటంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వీడియోలను పోస్ట్ చేస్తోంది. ముగ్గురు పిల్లలతో తాను జీవితం కొనసాగిస్తున్నానని, ఇలాంటి పరిస్థితుల్లో తోడు కోసం మరో పెళ్లి చేసుకున్నట్లు వనిత చెబుతోంది.