మణిరత్నం నవరసాలు వెబ్ సిరీస్..తెలుగు స్టార్స్ ఉంటారా

మారుతున్న కాలానికి అనుగుణంగా మన సినిమా వాళ్ళు సైతం మారక తప్పదు. ఎందుకంటే ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ చేసే పరిస్థితి ledhu. అందుకే స్టార్స్, స్టార్ డైరక్టర్స్ కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా సిరీస్‌లు చేయడానికి సినిమా స్టార్స్ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఓ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ‘నవరస అంటే నవరసాలు అనే థీమ్‌తో సాగే ఈ వెబ్ సిరీస్‌లో తొమ్మిది ఎపిసోడ్లు ఉంటాయని, ఒక్కో ఎపిసోడ్‌ను ఒక్కో డైరెక్టర్ డైరెక్ట్ చేస్తారని అంటున్నారు.
అలాగే ఒక్కో ఎపిసోడ్‌కి ఒక్కో హీరో ఉంటారని మణిరత్నం స్వయంగా ఓ ఎపిసోడ్ కి దర్శకత్వం వహిస్తారని అంటున్నారు. మణిరత్నం, గౌతమ్ వాసుదేవ మీనన్, కార్తీక్ నరేన్, నంబియార్, అరవింద స్వామి ఇలా ఒక్కో ఎపిసోడ్‌ని ఒక్కొక్కరు తెరకెక్కిస్తారట. మిగతా ఎపిసోడ్స్‌కి ఇంకా దర్శకుల ఎంపిక జరగలేదని సమాచారం. దీని కోసం తెలుగు నుంచి కూడా కొంతమంది దర్శకులు, హీరోల్ని ఎంచుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఇంకా దాని మీద పూర్తిగా క్లారిటీ అయితే రావాల్సి ఉంది.