English   

పుష్ప నుంచి విజయ్ సేతుపతి తప్పుకోవడానికి కారణం ఇదే

 Vijay Sethupathi
2020-07-16 18:39:02

నటుడిగా విజయ్‌ సేతుపతికి తమిళంలో మంచి గుర్తింపు వుంది. ఆయన సినిమాలో ఉంటే మినిమం హిట్ అని నమ్ముతున్నారు తమిళ మేకర్స్. తెలుగులో కూడా సేతుపతికి మంచి గుర్తింపే వుంది. ఆయనను అందుకే తెలుగు సినిమాల్లో కూడా డైరెక్ట్ గా రోప్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో ఆయన విలన్‌ గా నటించిన ‘ఉప్పెన’ విడుదలకు సిద్ధంగా వుంది. ఇక ఉప్పెన నిర్మించిన మైత్రీ మూవీస్‌ సంస్థనే నిర్మిస్తున్న మరో సినిమా పుష్ప. అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ముందు విజయ్‌ సేతుపతి విలన్‌ గా నటించనున్నాడని ప్రచారం జరిగింది. 

అయితే ఇదే విషయం మీద ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డేట్స్‌ కుదరకే తాను పుష్ప చిత్రంలో నటించడం లేదని చెప్పాడు. అయితే విజయ్‌సేతుపతి తప్పుకోవడానికి అసలు కారణం డేట్స్‌ కాదు రేటని అంటున్నారు. ఉప్పెన సినిమాకి 3 కోట్ల పారితోషికం తీసుకున్న విజయ్‌ ‘పుష్ప’లో నటించడానికి ఏకంగా 8 కోట్లు  డిమాండ్‌ చేయడంతో పాటు పుష్ప సినిమాని తాను విలన్‌గా నటిస్తున్న క్రమంలో తమిళంలో విడుదల చేయకూడదని షరతులు పెట్టాడట. దీంతో దర్శక, నిర్మాతలు విజయ్‌ సేతుపతి స్థానంలో వేరే నటుడిని తీసుకోవాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు.  

More Related Stories