English   

రకుల్ ప్రీత్ సింగ్ బ్యాక్ టూ హైదరాబాద్.. ఢిల్లీలో కరోనా భయం..

 Rakul preet Singh
2020-07-16 13:06:55

రకుల్ ప్రీత్ సింగ్ పేరుకు ఉత్తరాది అమ్మాయి అయినా కూడా ఆమె ప్రాణం అంతా ఇక్కడే ఉంటుంది. దానికి కారణం బాలీవుడ్ పట్టించుకోకపోయినా కూడా ఈమెను తెలుగు ఇండస్ట్రీ స్టార్ ను చేసింది. ఇక్కడే ఆమె ఆస్తులు కూడా ఉన్నాయి. హైదరాబాద్ లో సొంత ఇల్లు ఉంది. దాంతో పాటే ఎఫ్ 45 జిమ్ బిజినెస్ కూడా రన్ అవుతుంది. దాంతో పాటే మిగిలిన ఆస్తులు కూడా ఇక్కడే ఉన్నాయి. అందుకే సొంత రాష్ట్రం ఢిల్లీ కంటే కూడా హైదరాబాద్ అంటేనే రకుల్ కు మహా యిష్టం. ఇదిలా ఉంటే తాజాగా ఈమె హైదరాబాద్ కు వచ్చింది. దాదాపు 4 నెలల తర్వాత భాగ్యనగరానికి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. తమ్ముడు అమన్ తో కలిసి హైదరాబాద్ మకాం మార్చేసింది రకుల్. దాని వెనక పెద్ద కథే ఉంది. 

ప్రస్తుతం ఈమె ఉంటున్న ఢిల్లీలో కరోనా భయం భారీగానే ఉంది. అక్కడ కేసులు వేలకు వేలు వస్తున్నాయి. దాంతో పాటు ఢిల్లీలో కాలుష్యం కూడా చాలానే ఉంది. అందుకే షూటింగ్స్ లేకపోయినా కూడా హైదరాబాద్ లోని తన సొంతింటికి వచ్చింది రకుల్. ఇక్కడే ఏపీ సిఎం జగన్ ఇల్లు ఉన్న లోటస్ పాండ్ సమీపంలోనే రకుల్ సొంత ఫ్లాట్ ఉంది. అక్కడే ప్రస్తుతం తమ్ముడితో కలిసి ఉంటుంది రకుల్. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్ కరోనాలో కానీ కాలుష్యంలో కానీ బెటర్ సిటీ. అందుకే ఇక్కడే కొన్ని రోజులు ఉండబోతుంది ఈ బ్యూటీ. తెలుగులో ప్రస్తుతం రకుల్ కు సినిమాలు అయితే ఏం లేవు. నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కిస్తున్న సినిమా తప్ప. ఏదేమైనా కూడా చాలా రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చి ఇక్కడే ప్రశాంతంగా ఉండాలని చూస్తుంది రకుల్ ప్రీత్ సింగ్.

More Related Stories