నువ్వు చావకపోతే అత్యాచారం చేసి చంపేస్తాం అంటూ...

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వ్యవహారం ఇప్పటికీ చల్లార లేదు. సుశాంత్ మరణం తరువాత చాలా మంది మీద ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఇండస్ట్రీ పెద్దలు, దర్శక నిర్మాతల సినిమాలు లేకుండా చేసి ఒత్తిడి చేసిన కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న ఆరోపణలు ఆయన చనిపోయిన నాటి నుండి వినిపిస్తూనే ఉన్నాయి. ఈ లిస్టులో రియా చక్రవర్తి కూడా ఉంది. ఈమె సుశాంత్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ కావడమే దీనికి కారణం తాజాగా ఆమె సుశాంత్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ రెండు రోజుల క్రితం ఎమోషనల్ పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
'నువ్వు దూరమై నెలరోజులవుతోంది. అయినా నిన్ను నేను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను' అని సోషల్ మీడియాలో రాసుకుంది. అయితే కొందరు నెటిజన్లు శాంత్ చావుకు రియానే కారణమంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఆమెను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని రియా పేర్కొంది. తాజాగా తనపై వస్తున్న విమర్శలకు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను షేర్ చేసింది రియా చక్రవర్తి. మనూ రౌత్ అనే మహిళ అకౌంట్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో రియాకు ఓ బెదిరింపు మేసేజ్ వచ్చింది. ఆత్మహత్య చేసుకో లేదా మనుషుల్ని పంపి మరీ రేప్ చేయిస్తానంటూ ఆ మహిళ మెసేజ్ లో పేర్కొంది. ఆ మెసేజ్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేసిన రియా తనకు వస్తున్న వేదింపుల గురించి అభిమానులతో పంచుకుంది. ఇలాంటి బెదిరింపులు న్యాయమేనా అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.