English   

ప్రభాస్ కి నేను సరయిన జోడీ అంటున్న తాప్సీ

Taapsee Pannu
2020-07-17 07:41:12

తెలుగులో ఝుమ్మంది నాదం సినిమాతో ఎంట్రీ  ఇచ్చిన తాప్సీ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. అయితే ఇక్కడ అవకాశాలు తగ్గడంతో ముందు తమిళం వంక చూసి అక్కడ వర్కౌట్ కాకపోవడంతో బాలీవుడ్ కి చెక్కేసి అక్కడ బాగానే నిలదొక్కుకుంది. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కెరీర్‌ తొలి రోజుల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమె ప్రభాస్ తో చేసిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా గురించి మాట్లాడుతూ ఆ అవకాశం వచ్చినప్పుడు కాస్త ఆలోచించానని చెప్పింది. ఎందుకంటే అందులో రెండో నాయిక పాత్రను పోషిస్తే ఆ తరువాత వచ్చే అవకాశలన్నీ అలాగే వుంటాయని భయమేసింది.  కానీ ఆ తర్వాత అలా ఆలోచించడం కరెక్ట్ కాదని మంచి పాత్ర వచ్చినప్పుడు అది చిన్నదా పెద్దదా అనే విషయాన్ని పట్టించుకోకుండా సినిమాలి చేయాలనీ అనుకున్నానని చెప్పుకొచ్చింది. నిజానికి మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ హీరోయిన్ గా నాకు మంచి పేరును తెచ్చిందని చెప్పుకొచ్చింది. ప్రభాస్‌ ఎత్తుకు నేను బాగా సరిపోయానని, నాక్కూడ సినిమాలో మా జోడి బాగుందని అనిపించిందని ఆమె చెప్పుకొచ్చింది. 

More Related Stories