రీమేక్ ల మీద మనసుపడ్డ వరుణ్ తేజ్

టాలీవుడ్ లో ప్రస్తుతం రీమేక్ ట్రెండ్ నడుస్తోంది. రీమేక్ సినిమాలన్నీ దాదాపు హిట్ లు కొన్ని సూపర్ డూపర్ హిట్టవుతుండటంతో హిట్ లేని వారు అంతా అదే బాట పడుతున్నారు. అయితే రీమేక్ అంటే వేరే భాషల్లో హిట్టైన సినిమాలను రీమేక్ చేయడం కాదు.. తెలుగు హిట్టైన పాత సూపర్ హిట్ సినిమాలను ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు రీమేక్ చేయాలనే ప్రయత్నాలు గట్టిగా మొదలయ్యాయి. మెగా హీరో వరుణ్ తేజ్ కూడా పాత సినిమాలను రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్.. పనవ్ కళ్యాణ్ నటించిన ‘జానీ’ సినిమాతో పాటు చిరంజీవి హీరోగా నటించిన ఛాలెంజ్, కొదమ సింహం సినిమాలు వరుణ్ తేజ్ ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడని మెగా కాంపౌండ్ నుండి అందుతున్న సమాచారం. ఈ సినిమాలను వరుణ్ తేజ్ కాకుండా రామ్ చరణ్ రీమేక్ చేస్తే ఆ ఇంపాక్టే వేరుగా ఉంటుందని మెగా ఫ్యాన్స్ ఫీలవుతున్నట్టు చెబుతున్నారు. చూడాలి మరి ఏమవుతుందో ?