English   

స్టార్‌ సిస్టమ్‌ ఇక నశించినట్లే ...దర్శక నిర్మాత కీలక వ్యాఖ్యలు

Shekhar Kapur
2020-07-17 08:02:24

కరోనా వైరస్ దెబ్బకు సినిమా థియేటర్లు మూత పడి నాలుగు నెలలు కావొస్తోంది. ఇప్పటికీ థియేటర్లు ఎప్పటికి ఓపెన్ అవుతాయనే విషయం మీద క్లారిటీ లేదు. అయితే ఈ విషయం మీద దర్శక–నిర్మాత శేఖర్‌ కపూర్‌ సంచలన కామెంట్స్ చేశారు. ‘‘మరో ఏడాది వరకూ థియేటర్లు రీ ఓపెన్‌ అయ్యే అవకాశం లేదు. కాబట్టి మొదటి వారం మా సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరిందనే టాక్‌ ఇక వినిపించనట్లే. దీంతో ‘స్టార్‌ సిస్టమ్‌’ ఇక నశించినట్లే’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అన్నాడని కాదు కానీ ఈ వైరస్ కు ఒక మంచి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేదాకా థియేటర్స్ లాంటి జన సమ్మర్దం ఉండే ప్రదేశాలు మళ్ళీ ఓపెన్ చేసే పరిస్థితి కనపడం లేదు. అందుకే స్టార్స్‌ సైతం తమ సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. 

అయితే బాలీవుడ్ స్టార్స్ అందుకు సిద్దం అవుతుండగా తెలుగు స్టార్స్ మాత్రం దానికి ఇంకా అలవాటు పడలేదు. ఈ క్రమంలో ఆయన చేసిన మరికొన్ని కామెంట్స్ స్టార్స్‌ తమ సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేసుకోవడానికి రెడీ అయిపోవాలి. సొంత యాప్‌లతో వాళ్లు సిద్ధంగా ఉండాలి. టెక్నాలజీ అంతా మన చేతుల్లోనే ఉందని శేఖర్‌ కపూర్‌ పేర్కొన్నారు. ఇప్పటికే అక్షయ్‌ కుమార్‌ (‘లక్ష్మీ బాంబ్‌’), అజయ్‌ దేవగన్‌ (భూజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా) వంటి స్టార్స్‌ చిత్రాలు ఓటీటీలో విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇక మన టాలీవుడ్ స్టార్స్ ఎప్పటికి రెడీ అవుతారో చూడాలి మరి. 

More Related Stories