English   

భగవద్గీత సాక్షిగా అంటోన్న తేజూ 

Sai Dharam Tej
2020-07-17 08:07:32

ఒకప్పుడు వరుస ఫ్లాప్ లు అందుకుని డీలా పడిన సాయి తేజ్ ఇప్పుడు ‘చిత్రలహరి’, ‘ప్రతి రోజు పండగే’ విజయాల ఉత్సాహంతో ఉన్నాడు. ఇప్పటికే ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ సినిమా విడుదల కావాల్సి ఉన్నా అది కరోన వలన వాయిదా పడింది. ఇక ఖాళీ సమయంలో సాయితేజ్‌ కొత్త కథలు వింటున్నాడని ఆయన సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం. సీనియర్‌ డైరెక్టర్ లేదా హిట్‌ కొట్టిన డైరెక్టర్ అనే నియమాలు ఏవీ పెట్టుకోకుండా విషయం ఉంటే చాలు కొత్త వాళ్లతో అయిన సినిమాలు చేయాలని అనుకుంటున్నాడట. ఈ క్రమంలో ధరమ్‌ తేజ్‌ ఓ కొత్త దర్శకుడి కథ విన్నాడని తెలుస్తోంది. 'భగవద్గీత సాక్షిగా' అనే ఆ కథ, కాన్సెప్ట్‌ కొత్తగా ఉండడంతో సినిమా చేయడానికి తేజు సిద్ధమయ్యాడని అంటున్నారు. ఫైనల్ చేసేందుకు ఈ కథను చిరంజీవి వద్దకు కూడా పంపారని తెలుస్తోంది. చిరు ఓకే చేస్తే తేజుకు మరో సినిమా రెడీ అయినట్లేనని అంటున్నారు. నిజానికి 'సోలో బ్రతుకే సో బెటర్‌' తరువాత దేవా కట్టాతో ఓ సినిమా చేయాల్సి ఉంది.  

More Related Stories