English   

తొలి ఇండియన్ సినిమాగా బన్నీ మూవీ రికార్డ్

 Sarrainodu
2020-07-17 08:19:15

ఈ మధ్య తెలుగు సినిమాలకి బాలీవుడ్ లో మంచి ఆదరణ లభిస్తోంది. కొన్ని సినిమాలని రీమేక్ చేస్తుండగా మరికొన్నిటిని మాత్రం హిందీ డబ్బింగ్ చెప్పించి డిజిటల్ ఫ్లాట్ ఫాంలలో విడుదల చేస్తున్నారు. ఈ మధ్యన మన సినిమాలని హిందీ వాళ్ళు బాగా చూస్తున్నారు. అలాగే అల్లు అర్జున్‌ నటించిన సరైనోడు సినిమా యూట్యూబ్‌లో రికార్డు సృష్టిస్తోంది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్‌కు ఇప్పటివరకు యూట్యూబ్‌లో 300 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. హిందీ సినిమాలు కూడా ఈ స్థాయిలో వ్యూస్ దక్కించుకోలేకపోయాయని అంటున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియా అనలిస్ట్‌ కమల్‌నాథ్‌ ట్వీట్ చేశారు. ఈ సినిమా ఆల్‌ టైమ్ రికార్డు సృష్టించిందని, 300 మిలియన్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. 2016లో విడుదలైన ఈ సరైనోడు సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా, తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్‌ లు హీరోయిన్స్ గా నటించారు. ఆది పిని శెట్టి విలన్‌ పాత్రలో నటించిన ఈ సినింని అల్లు అరవింద్‌ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించారు.  

More Related Stories