English   

గోపీచంద్ సినిమాలో కీర్తి సురేష్ 

Keerthy Suresh
2020-07-18 08:18:57

దర్శకుడు తేజ మొన్ననే తన పుట్టినరోజున రెండు చిత్రాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘అలిమేలుమంగ వేంకటరమణ’, ‘రాక్షసరాజు రావణాసురుడు’ అనే టైటిల్స్‌ ప్రకటించాడు తేజ. అయితే హీరోలు కానీ హీరోయిన్స్ కానీ ఇంకెవరినీ ప్రకటించ లేదు. అయితే అందుతున్న సమాచారం మేరకు ఈ రెండు సినిమాలు రెండు రానా, గోపీచంద్‌ కథానాయకులుగా తెరకెక్కనున్నాయి. ఇదిలా ఉంటే గోపీ చంద్ తో తెరకెక్కించే ‘అలిమేలుమంగ వేంకటరమణ’ సినిమాలో హీరోయిన్ గా  టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్ ను ఫైనల్ చేసే అవకాశం ఉందని ఆ మధ్య ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పటికే ప్రాముఖ్యత ఉన్న ఈ పాత్ర కోసం స్టార్ హీరోయిన్ల పేర్లని కూడా తేజ పరిశీలించారట. ఈ పాత్రకు కాజల్‌, అనుష్కలో ఒకర్ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నా , ఈ సినిమా షూట్ మొదలయ్యే నాటికి కాజల్, అనుష్క ఖాళీగా ఉండి బల్క్ డేట్స్ ఇచ్చే పరిస్థితిలో ఉంటారా ? అనేది అనుమానమే. ఎందుకంటే కాజల్‌ చేతిలో ‘మోసగాళ్లు’, ‘ఆచార్య’, ‘ముంబయి సాగా’, ‘భారతీయుడు2’తో పాటు మరో బాలీవుడ్‌ సినిమా కూడా ఉంది. అనుష్క కూడా నాయికా ప్రాధాన్యత ఉన్న సినిమాలే చేస్తోంది. ఆమె ఈ సినిమా చేస్తుందన్న నమ్మకం అయితే లేదు. అందుకే ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించే అవకాశం ఉందని అంటున్నారు. వినూత్న పాత్ర కావడంతో  ఆమె ఈ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు చెబుతున్నారు.ప్రస్తుతం కీర్తిసురేష్‌ ‘సర్కారువారి పాట’ సినిమాలో మహేష్‌బాబు సరసన నటిస్తోంది. 

More Related Stories