జూనియర్ రణ్ బీర్ కపూర్ కన్నుమూత..

ఈ ప్రపంచంలో మనుషులు పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అని చెప్తూ ఉంటారు. అంత మంది ఉన్నారో లేదో తెలియదు కానీ కొందరిని చూస్తే మాత్రం అచ్చం మరొకరిలా కనిపిస్తుంటారు. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ డూప్ కూడా అలాగే ఉండేవాడు. అతడి పేరు జునైద్ షా. ఈయన చూడడానికి అచ్చు గుద్దినట్లు రణ్ బీర్ కపూర్ మాదిరే ఉంటాడు. అప్పట్లో ఈయన ఫోటోను ట్వీట్ చేసి రిషికపూర్ కూడా తన కొడుకుకు జూనియర్ ఒకరు ఉన్నారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ కుర్రాడు చనిపోయాడు.
హార్ట్ ఎటాక్ రావడంతో చాలా చిన్న వయసులోనే మరణించాడు. తన సొంత రాష్ట్రం కాశ్మీర్ లోని శ్రీనగర్ లో జూలై 16 రాత్రి ఆయన మరణించాడు. జునైద్ మరణవార్త తెలుసుకుని రన్బీర్ కపూర్ అభిమానులు కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు. చాలా త్వరగా అందరినీ విడిచి వెళ్లి పోయావు.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈయన మరణంపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా సోషల్ మీడియాలో స్పందించారు.