English   

ముంబై నానావతి హాస్పిటల్ లో అడ్మిట్ అయిన ఐశ్వర్యారాయ్..

Aishwarya Rai
2020-07-18 09:21:39

పేద పెద్ద అనే తేడా లేకుండా కరోనా వైరస్ అందరిని వణికిస్తోంది. ప్రపంచంలో ఇప్పటికే ఎన్నో దేశాలను ఈ వైరస్ పట్టి పీడిస్తుంది. ఇండియాలో ఉగ్రరూపం దాల్చింది కరోనా. ఏమాత్రం జాలి దయ కరుణ లేకుండా అందరిపై విరుచుకుపడుతోంది. బచ్చన్ కుటుంబాన్ని సైతం కరోనా వైరస్ వదల్లేదు. ఇప్పటికే అమితాబ్, అభిషేక్ బచ్చన్ ముంబై నానావతి హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. వీళ్లతో పాటు ఐశ్వర్యారాయ్ ఆమె కూతురు ఆరాధ్య కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. నాలుగు రోజుల కింద వీళ్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు ఐశ్వర్య, ఆరాధ్య. అలా ఉంటే సరిపోతుంది అంటూ అభిషేక్ బచ్చన్ కూడా ట్వీట్ చేశాడు. 

కానీ నాలుగు రోజుల తర్వాత ఐశ్వర్యారాయ్, ఆమె కూతురు ఆరాధ్యలో కరోనా లక్షణాలు మరింత ఎక్కువగా కనిపించాయి. దాంతో వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ప్రస్తుతం వాళ్ళకు అక్కడ చికిత్స జరుగుతోంది. ప్రమాదమేమీ లేదని.. కొన్ని రోజులు చికిత్స తీసుకుంటే సరిపోతుంది అంటున్నారు వైద్యులు. మరోవైపు బచ్చన్ మూడు తరాలు ముంబై నానావతి హాస్పిటల్ లోనే ఉన్నారు. అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, ఆయన మనవరాలు ఆరాధ్య ప్రస్తుతం అక్కడ చికిత్స తీసుకుంటున్నారు. ఏదైనా అమితాబ్ బచ్చన్ కుటుంబం త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు అభిమానులు. 

More Related Stories