English   

మరోసారి డ్యూయల్ రోల్ లో ప్రభాస్

 Prabhas
2020-07-18 17:17:01

బాహుబలి, బాహుబలి 2 వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తరువాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు. అత్యంత క్రేజ్‌ ఉన్న పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ అంటే అతిశయోక్తి కాదేమో. జపాన్, చైనా లాంటి దేశాల్లో కూడా ఈ బాహుబలి సిరీస్ రిలీజ్ కావడంతో ప్రభాస్ ఇమేజ్ హాలివుడ్ స్థాయికి చేరింది. అయితే ఆ ఇమేజ్ ను క్యాష్ చేసుకోవడానికి సాహో సినిమాను ఇంటర్నేషనల్ రేంజ్ నిర్మాణ విలువలతో రూపొందించినప్పటికీ బాక్సాఫీసు వద్ద మాత్రం అది నిలవకేకపోయింది. అయితే ఇప్పుడు ఆయన జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో వింటేజ్ స్టైల్‌ లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ అశ్వినీ దత్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కిస్తున్నారు. 

సైన్స్‌ ఫిక్షన్‌ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 200 కోట్ల బడ్జెట్‌తో పాన్‌ ఇండియన్ మూవీగా తెరకెక్కుతోన్నది. సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు తుదిదశకు చేరుకున్నట్లు తెలిసింది. ఈ ఏడాది చివరలో సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నా రాధే శ్యామ్ పూర్తి కావడం మీదే ఇది ఆధార పడి ఉంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన  దీపికా పదుకొన్ కథానాయికగా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  

More Related Stories