English   

పవన్ సినిమాకి ఆసక్తికర టైటిల్

 pawan krish
2020-07-18 17:50:53

పవర్ స్టార్ హీరోగా విలక్షణ చిత్రాల దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఓ మూవీ తెరకెక్కుతోన్న ఈ సినిమాకి ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పీరియాడిక్ మూవీగా తెరక్కుతోన్న ఈ సినిమాకి సంబంధించి లాక్ డౌన్ కి ముందే దర్శకుడు క్రిష్ కొంత మేర షూటింగ్ జరిపారు. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా అని ప్రచారం జరుగుతోన్న ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా విడుదల చేయనున్నారు. క‌రోనా ఎఫెక్ట్ త‌గ్గిన త‌ర్వాత సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రానికి సంబంధించి ముందు నుండీ ఒక టైటిల్ ప్రచారంలో ఉంది. 

తాజగా ఈ సినిమా టైటిల్ అంటూ మరో పేరు ప్రచారంలోకి వచ్చింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ బందిపోటుగా క‌నిపించ‌నున్న ఈ సినిమాకి వీర అనే టైటిల్ స‌రిగ్గా స‌రిపోతుంద‌ని టీం భావిస్తుంద‌ని అంటున్నారు. ప‌వ‌న్ కూడా ఈ టైటిల్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు చెబుతున్నారు. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఈ సినిమాలోని ఓ క‌థానాయిక‌గా క‌నిపించ‌నుందని అంటున్నారు. వీలయినంత త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్టు చెబుతున్నారు.  

More Related Stories