English   

మారుతితో గోపీ చంద్ సినిమా 

Gopichand
2020-07-18 18:12:24

ఈ మధ్య కాలంలో గోపీచంద్ టైం అసలు కలిసి రావడం లేదు. తొలివలపు లాంటి లవ్ స్టోరీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన గోపీ ఆ తర్వాత మూడు సినిమాలకి నెగటివ్ రోల్స్ చేసాక మళ్ళీ హీరో అయి ఆడియెన్స్ ని మెప్పించాడు. నిజానికి ఆయన హీరోగా కంటే విలన్ గానే బాగుంటాడని కూడా విశ్లేషకులు చెబుతూ ఉంటారు. అయితే ఆ విషయాన్నీ పక్కన పెడితే 2006 నుండి ఈయన ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. ఒక్కో ఏడాది మిస్ చేసాడు అది వేరే విషయం. 

అయితే చివరిగా 2014లో  హిట్ అందుకున్న ఈయన ఆ తర్వాత హిట్ కోసం చేయని ప్రయత్నం లేదు, దాదాపు అరడజను సినిమాలు రిలీజ్ చేసినా ఏ ఒక్క సినిమా కూడా అనుకున్న మేర ఆడలేదు. చివరిగా ఆయన చేసిన సినిమా చాణక్య కూడా సరిగా ఆడలేదు. ఇప్పుడు ఆయన సంపత్ నంది దర్శకత్వంలో సీటీమార్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే తాజాగా ఆయన తరువాతి సినిమా గురించి ఒక ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. అదేంటంటే ప్రతిరోజు పండగే సినిమాతో హిట్ అందుకుని ఖాళీగా ఉన్న మారుతి దర్శకత్వంలో గోపీచంద్ ఓ సినిమా చేయబోతున్నాడని సమాచారం. ఈ లాక్‌ డౌన్‌ సమయాన మారుతి అద్భుతమైన కథ తయారు చేశారని అంటున్నారు.  

More Related Stories