English   

ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ ల సినిమాల్లో అదే కామన్ పాయింట్ 

Prabhas NTR mahesh
2020-07-18 21:16:57

టాలీవుడ్ లో ఒక్కోసారి ఒక్కో విచిత్రమైన పరిస్థితులు నేలకొంటూ ఉంటాయి. అనుకోకుండా అందరు మేకర్స్ ఒకే రకమైన జానర్స్ ను ఎంచుకుంటూ ఉంటారు. అది కాకతాళీయమో, యాదృచ్ఛికమో అర్ధం కాదు కానీ అలా జరుగుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు కూడా టాలీవుడ్ లో తెరకెక్కనున్న మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ గురించి ఆసక్తికర వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఆ వార్తల సారాంశం ఏమిటంటే ముగ్గురు టాలీవుడ్ స్టార్ లు తమ తమ తదుపరి సినిమాలలో డ్యూయల్ రోల్ చేస్తున్నారట. వారు ఎవరో కాదు మహేష్, ఎన్టీఆర్ మరియు ప్రభాస్ లే. మహేష్ దర్శకుడు పరుశురామ్ తో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన రెండు భిన్నమైన షేడ్స్ కలిగిన డ్యూయల్ రోల్ చేస్తున్నాడని అంటున్నారు. అలానే ఎన్టీఆర్ తన 30వ చిత్రం దర్శకుడు త్రివిక్రమ్ తో ప్రకటించారు. ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ ది డ్యూయల్ రోల్ అని అంటున్నాడు. ఇక మరో హీరో ప్రభాస్ కూడా నాగ్ అశ్విన్ తో ఓ భారీ పాన్ ఇండియా మూవీ ప్రకటించారు. ఈ సినిమాలో కూడ ప్రభాస్ ది కూడా డ్యూయల్ రోల్ అని ప్రచారం జరుగుతుంది. చూడాలి ఇందులో నిజం ఎంత ఉందనేది.

More Related Stories