English   

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ ఘోష.. వైరల్ అవుతున్న వీడియో..

Sushant Singh Rajput
2020-07-19 14:15:56

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయి నెల రోజులు అవుతున్నా ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే విషయం మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. బాలీవుడ్ లో పెరుగుతున్న బంధుప్రీతి కారణంగానే ఆయన చనిపోయాడు అంటూ అభిమానులు మండిపడుతున్నారు. అవకాశాలు రాకుండా చేసి చివరికి సుశాంత్ ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారు అంటూ కొందరిపై కేసులు కూడా పెట్టారు. మరోవైపు ఇది ఆత్మహత్య కాదు హత్య అంటూ కొత్త వాదన కూడా తెరపైకి తీసుకొచ్చారు. ఇవన్నీ ఇలా ఉంటే తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ తనతో మాట్లాడింది అంటూ ప్రముఖ పారానార్మల్ యాక్టివిటీ స్పెషలిస్ట్ స్టీవ్ హుఫ్ సంచలన వీడియో పోస్ట్ చేశాడు. 

గత పదేళ్లుగా ఈయన ఆత్మలతో మాట్లాడే పని కొనసాగిస్తున్నాడు. ఈయన ఆత్మలతో మాట్లాడే విషయం ప్రపంచ వ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందింది. కేవలం దీని కోసమే ఈయన కొన్ని అత్యుత్తమ పరికరాలను కూడా కనుగొన్నాడు. వీటి సహాయంతో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మతో మాట్లాడడం జరిగిందని చెప్పుకొచ్చాడు హుఫ్. చాలా మంది నెటిజన్లు సుశాంత్ ఎందుకు చనిపోయాడు తెలుసుకోవాలని తనను అడిగారని.. ఆయన ఆత్మతో ఒకసారి మాట్లాడండి అంటూ తనకు రిక్వెస్ట్ పెట్టారని చెప్పుకొచ్చాడు స్టీవ్ హుఫ్. అందుకే తాను ఆత్మతో మాట్లాడాలని అనుకున్నట్టు చెప్పాడు. అక్కడ సుశాంత్ ఆత్మ ఒక్కటే లేదని.. ముందు తన గొంతు వినిపించిన తర్వాత ఒక మహిళ అరుపులు కూడా ఉన్నాయని ఈ వీడియోలో అర్థమవుతుంది. మరి ఇది ఎంత వరకు నిజం అనేది మాత్రం ఎవరి నమ్మకానికి వాళ్లకు వదిలేయాల్సిందే. 

More Related Stories