English   

ఆర్ఆర్ఆర్ గురించి కీలక విష‌యాలు వెల్లడించిన బుర్రా

Sai Madhav Burra
2020-07-19 15:04:46

మాటల రచయితగా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ అందుకున్నాడు సాయి మాధవ్ బుర్రా. ఎన్నో హిట్ సినిమాలకి డైలాగ్ రైట‌ర్‌గా ప‌ని చేసిన సాయి మాధ‌వ్ బుర్రా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాకి రైటర్ గా ప‌ని చేస్తున్నారు. టాలీవుడ్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఆర్ఆర్ఆర్‌కి సంబంధించి సాయి మాధ‌వ్ బుర్రా తాజగా కీలక అంశాలు వెల్లడించారు. ఒకరకంగా ఆయన చెప్పిన విష‌యాలు ఎన్టీఆర్, చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌ కి శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో హీరోలు ఇద్దరూ టాలీవుడ్ లో రెండు పెద్ద ఫ్యామిలీలకి చెందిన వారు. ఇక్కడ ఒకరి రోల్ ఎక్కువ మరొకరి రోల్ తక్కువ ఉంటే మొదటికే మోసం రావచ్చు. జక్కన్న ఇద్దరినీ సాటిస్ఫై చేస్తారని అనుకుంటున్నా ఆ భయాన్ని సాయి మాధవ్ కూడా క్లియర్ చేశారు. ఈ సినిమాలో చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ పాత్ర‌ల‌ని రాజ‌మౌళి ఎలా బ్యాలెన్స్ చేశారో, తాను కూడా ఒక‌రు ఎక్కువ‌, ఒక‌రు త‌క్కువ అని కాకుండా ఇద్ద‌రికి సరిసమానంగా డైలాగ్స్ రాశానని బుర్రా చెప్పుకొచ్చారు. ఇద్దరి పాత్రల నిడివి కూడా స‌మానంగా ఉంటుంద‌ని, అభిమానులు ఈ విష‌యంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవ‌ద్దని ఆయన పేర్కొన్నారు. ప్రేక్ష‌కుల ఎన్ని అంచ‌నాల‌తో వచ్చిన ఆ అంచనాలకు మించే ఈ సినిమా ఉంటుందని పేర్కొన్నారు. 

More Related Stories