పవర్ స్టార్ సినిమా ట్రైలర్ చూడటానికి డబ్బులు పెట్టాల్సిందే..

వర్మను తిట్టుకుంటారు కానీ ఆయనకు ఉన్న తెలివితేటలు ఇండస్ట్రీలో ఎవరికీ లేవు. ఎడారిలో ఇసుక అమ్మే రకం ఈయన. సముద్రంలో నీరు తీసి మినరల్ వాటర్ అంటూ లాభాలకు అమ్మేస్తాడు. అన్ని తెలివితేటలు రాంగోపాల్ వర్మ సొంతం. ఇప్పుడు కూడా ఆయన ఇదే చేస్తున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత కథ అంటూ పవర్ స్టార్ సినిమా తీస్తున్నాడు వర్మ. అడిగితే నా ఇష్టం అంటున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లతో సినిమాపై అంచనాలు పెంచేసాడు. ఇది ఖచ్చితంగా వర్మ వేసే సెటైర్ అని అర్థమవుతుంది. ఇప్పుడు మరో సంచలనానికి కూడా తెరతీశాడు ఈయన. తన సినిమా ట్రైలర్ చూడటానికి కూడా డబ్బులు కావాలి అంటూ కొత్త ఫిటింగ్ పెట్టాడు ఆర్జీవి.
పవర్ స్టార్ సినిమా ట్రైలర్ july 22 ఉదయం 11 గంటలకు విడుదల కానుంది. ఆర్జీవి వరల్డ్ థియేటర్లో ఈ ట్రైలర్ విడుదల అవుతుంది. దీని చూడాలంటే 25 రూపాయలు చెల్లించాల్సిందే. ప్రపంచంలో ఇలా ఒక ట్రైలర్ చూడటానికి డబ్బులు కట్టాలి అన్న మొట్టమొదటి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రమే. అందుకే ఈయనను తెలివైనవాడు అనేది. డబ్బులు పెట్టి ఎవరు ట్రైలర్ చూస్తారు అనుకోవచ్చు.. కానీ కచ్చితంగా కొందరు ఉంటారు.. పవన్ కళ్యాణ్ అంటే పడని వాళ్ళు ఖచ్చితంగా ఈ ట్రైలర్ చూడటానికి ఆసక్తి చూపిస్తారు. అలాంటి వాళ్ల ఆసక్తిని వర్మ సొమ్ము చేసుకుంటున్నాడు. ఈయన తెలివితేటలు చూసి నిజంగానే మిగిలిన దర్శకులకు అప్పుడప్పుడు కుళ్ళు వచ్చేస్తుంది. మరి ఈ ట్రైలర్ కోసం డబ్బులు కాన్సెప్ట్ ఎంతవరకు హిట్ అవుతుందో చూడాలి.