English   

స్టార్ హీరోయిన్స్ రెమ్యునరేషన్ పై కరోనా ఎఫెక్ట్ 

tollywood star heroines
2020-07-19 19:19:38

టాలీవుడ్‌లో ఒకప్పటి పరిస్థితులు రావడానికి కొన్ని రోజులు పడుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు పనులు లేకుండా ఉన్నారు కదా. పైగా నిర్మాతలకు కోట్లలో నష్టాలు వచ్చేసాయి. ఇండస్ట్రీ కూడా దాదాపు 2 వేల కోట్లకు పైగానే నష్టపోయింది. ఇలాంటి సమయంలో కచ్చితంగా ఒకప్పటి పరిస్థితులు రావడానికి కొన్నాళ్లు టైమ్ పడుతుంది. అప్పటి వరకు రెమ్యునరేషన్స్ విషయంలో కూడా కోత తప్పదు.

పూజా హెగ్డే: టాలీవుడ్‌లో ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే మరో అనుమానం లేకుండా పూజా హెగ్డే పేరు వినిపిస్తుంది. వరసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్న ఈమె పారితోషికం కూడా 2 కోట్లకు పైమాటే. కానీ ఇప్పుడు కరోనా కారణంగా భారీగానే ఈమె పారితోషికంలో కోత పడింది. ప్రభాస్ రాధే శ్యామ్‌తో పాటు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో నటిస్తుంది పూజా.

సాయి పల్లవి: టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి కూడా తన పారితోషికంలో స్వచ్ఛందంగా కోత పెట్టుకుందని తెలుస్తుంది. విరాట పర్వంతో పాటు లవ్ స్టోరీ సినిమాల కోసం తను తీసుకునే దానికంటే కూడా తక్కువగానే అందుకుంటుంది ఈమె.

సమంత అక్కినేని: సమంత ఇప్పుడు కూడా సినిమాకు 2 కోట్ల వరకు తీసుకుంటుంది. అయితే ప్రస్తుతం సినిమాలేవీ ఒప్పుకోొవడం లేదు సమంత. ఒకవేళ ఒప్పుకున్నా కూడా రెమ్యునరేషన్ కట్ చేసుకోడానికి సిద్ధంగానే ఉంది.

అనుష్క శెట్టి: అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈమె ఒక్కో సినిమాకు 3 కోట్లకు పైగానే తీసుకుంటుంది. అయితే కరోనా కారణంగా రేంజ్ 2 కోట్ల కంటే కిందకు పడిపోయింది.
రకుల్ ప్రీత్ సింగ్: అందరికంటే ముందు తన రేటులో రిబేటు ప్రకటించింది రకుల్ ప్రీత్ సింగ్. ఈమె తన పారితోషికాన్ని భారీగానే కోత పెట్టుకుంది. కోట్ల నుంచి లక్షల్లోకి దిగిపోయింది రకుల్.
కాజల్ అగర్వాల్: చందమామ తగ్గనని ముందు మొండికేసినా కూడా కరోనా వచ్చి దించేసింది. ఒకప్పుడు కోటిన్నర కావాలన్న కాజల్ ఇప్పుడు కోటికి కూడా ఓకే అనేస్తుంది.
రష్మిక మందన్న: సరిలేరు నీకెవ్వరు సినిమాతో కోటి తారగా మారిపోయిన రష్మిక.. ప్రస్తుతం మాత్రం 75 లక్షల వరకు ఓకే అంటుందని తెలుస్తుంది. కన్నడలో 50 లక్షల లోపే ఈమె పారితోషికం ఉంది.
తమన్నా భాటియా: ఈ మధ్య అవకాశాలు కూడా బాగానే తగ్గడంతో భారీగానే తన పారితోషికం తగ్గించుకుంది తమన్నా. సినిమాకు 50 నుంచి 75 లక్షల వరకు తీసుకుంటుంది తమన్నా.
రాశీ ఖన్నా: రాశీ ఖన్నా రేంజ్ కూడా 50 లక్షల లోపే ఉందిప్పుడు.
రెజీనా: రెజీనా అయితే ఏకంగా విలన్ వేషాలు కూడా వేస్తుంది. పైగా పారితోషికం కూడా చాలా తక్కువ.
శృతి హాసన్: ఒకప్పుడు కోటికి పైగానే తీసుకున్న శృతి హాసన్ ఇప్పుడు మాత్రం లక్షలు తీసుకుంటుంది. రవితేజ క్రాక్ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ.
ఇలియానా: అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా కోసం దాదాపు 2 కోట్లకు పైగానే తీసుకున్న ఇలియానా ఇప్పుడు 75 లక్షల రేంజ్‌కు పడిపోయింది.
అనుపమ పరమేశ్వరన్: రాక్షసుడు సినిమా తర్వాత అసలు అనుపమను పట్టించుకోవడం లేదు తెలుగు దర్శక నిర్మాతలు. 

More Related Stories