English   

స్మిత ఫేస్ బుక్‌లో అశ్లీల ఫోటోలు..భయంకరమైన రోజు అంటూ

 Singer Smita
2020-07-20 08:02:58

సోషల్ మీడియా అంటేనే ఒక రచ్చ. ఇక్కడ మంచి వాళ్ళు ఉంటారు ఎదవలు ఉంటారు. మంచి వాళ్ళు తగిలితే పర్లేదు కానీ హ్యాకింగ్ గాళ్ళు తగిలితేనే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే టెక్నాలజీ తెలిసిన కొందరు హీరోయిన్‌ల ఫోటోలు మార్ఫింగ్ చేసి పైశాచిక ఆనందం పొందుతుంటారు. అంతేకాక‌ మార్ఫింగ్ ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డం చేసి రచ్చ చేస్తుంటారు. ఇక సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్ లు హ్యాక్ కావడం కామన్ అయిపొయింది. ఈ మధ్య పలువురు హీరోయిన్ల ఎకౌంట్లు సైబర్ నేరగాళ్లు హ్యాక్ కు గురవుతున్నాయి. 

తాజాగా తెలుగు పాప్ సింగర్ స్మిత ఫేస్ బుక్ పేజ్ హ్యాక్ అయ్యింది.  పాప్ సింగ‌ర్ స్మిత ఫేస్ బుక్ పేజ్ లోను న్యూడ్ ఫోటోలు దర్శ‌న‌మిచ్చాయి. దీనిపై స్పందించిన స్మిత వాటిని డిలీట్ చేసి ఇదొక భ‌యంక‌ర‌మైన రోజు అని కామెంట్ పెట్టింది. ‘ఇదో భయంకరమైన రోజని.. తన ఫేస్ బుక్‌ని హ్యాక్ చేసి స్టుపిడ్ కంటెంట్‌ పోస్ట్ చేశారని.. వాటి వల్ల ఎవరికైనా అసౌకర్యం కలిగితే క్షమించాలని కోరింది స్మిత. తన ఫేస్ బుక్ తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడానికి సహకరించి ఫేస్ బుక్ టీం అందరికీ ధన్యవాదాలు తెలిపింది స్మిత. 

More Related Stories