బిచ్చగాడు సీక్వెల్...ఆరోజే ప్రకటన

బిచ్చగాడు సినిమాతో తెలుగులో కూడా పాపులర్ అయ్యారు విజయ్ అంటోనీ. ఆయన హీరోగా నటించిన ఆ సినిమాకి మంచి పేరు వచ్చినా ఆయన పేరు మాత్రమే తెలుగు ప్రేక్షకులకి బాగా రిజిస్టర్ అయ్యింది. సంచలన విజయం సాధించిన ఈ సినిమాతోనే విజయ్ ఆంటోని ఇమేజ్ అమాంతం పెరిగిందని చెప్పచ్చు. అమ్మ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు త్వరలో సీక్వెల్ రాబోతుందని అంటున్నారు. అంతే కాక ఈ సినిమా కోసం నటుడు విజయ్ స్టోరీ రైటర్ గా మారారని అంటున్నారు. బిచ్చగాడు సీక్వెల్ పై ఎప్పటి నుండో ప్రచారం జరుగుతోంది. ఈ విషయం మీద విజయ్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. జూలై 24న విజయ్ ఆంటోని బర్త్డే కావడంతో ఆ రోజు చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేస్తారని పేర్కొంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. బిచ్చగాడు సినిమాని విజయ్ ఆంటోనీ స్వయంగా నిర్మించగా, దర్శకుడు శశి తెరకెక్కించారు. ఇక ఈ మూవీకి సంగీతం కూడా విజయ్ ఆంటోనీ సమకూర్చారు. మరి సీక్వెల్ ని ఏ దర్శకుడిని అప్పచెబుతారు అనే విషయం మీద సందిగ్దత నెలకొంది.