జక్కన్న ఆ పనిలో బిజీగా ఉన్నాడట

బాహుబలి సిరీస్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి ప్రారంభించిన క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’. తెలుగు నాడు నుండో స్వతంత్రం కోసం పోరాడిన వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీం జీవిత కథలను కలుపుతూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఏ ముహూర్తాన ప్రారంభించారో ఎప్పుడూ ఏవో ఒక ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్నారు. ఇక రామ్‌చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తోంది. ఇప్పటికే ఇప్పటికే 80 శాతం మేర ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా సెప్టెంబర్ కల్లా షూటింగ్ ను కంప్లీట్ చేయాలని చూస్తున్నారు.
అయితే టాలీవుడ్ లోని అన్ని సినిమాల్లానే ఈ సినిమాకి కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. అయినా ఎలా అయినా ఆర్ఆర్ఆర్ డేట్ అనౌన్స్ చేసిన నాటికి రిలీజ్ చేయడానికి గట్టి ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఇప్పుడు షూట్ మొదలు పెడదామని అనుకున్నా కుదిరే పని కాదు. రెండు మూడు మార్లు మాక్ షూట్ నిర్వహించాలని అనుకున్నా అది కుదరలేదు. అందుకే జక్కన్న నల్గొండ జిల్లాలోని తన ఫాం హౌస్ కి షిట్ అయ్యాడని అన్నారు. ఇక ఆయన అవేంటో కాదు మహేశ్‌బాబుతో తదుపరి చేయబోయే సినిమాకు సంబంధించిన కథను ఫైనల్ చేస్తున్నాడట. అంతే కాక ఆర్ఆర్ఆర్కు సంబంధించిన యానిమేషన్ పనులు చేయిస్తున్నట్టు చెబుతున్నారు.