English   

బ్రేకింగ్ న్యూస్.. వైయస్ జగన్ బయోపిక్ లో అల్లు అర్జున్..

Allu Arjun
2020-07-20 08:36:12

ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మాత్రం ఈ వార్త బాగా వైరల్ అవుతుంది. త్వరలోనే వైయస్ జగన్ బయోపిక్ లో అల్లు అర్జున్ నటించబోతున్నాడు అంటూ ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్నాడు బన్నీ. ఈ చిత్ర షూటింగ్ మొన్నీమధ్యే మొదలైంది. కరోనా కారణంగా బ్రేక్ పడింది. ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలను కూడా లైన్ లో పెట్టేసాడు బన్నీ. అందులో ఐకాన్ కూడా ఒకటి ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమాను తెరకెక్కిస్తున్న వేణు శ్రీరామ్ తో ఐకాన్ సినిమా చేయబోతున్నాడు బన్నీ. ఇదిలా ఉండగానే మరో కొత్త ప్రాజెక్టుకు కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. 

గతేడాది ‘యాత్ర’ సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు మహి ఆర్‌ రాఘవతో ఓ ప్యాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు బన్నీ. ఈయన చెప్పిన కథ సింగిల్ సిట్టింగ్ లోనే బన్నీ ఓకే చేసినట్లు తెలుస్తుంది. పూర్తిగా పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ కథ కూడా ఫైనలైజ్ అయిపోయి స్క్రీన్ ప్లే సిద్ధం చేస్తున్నాడు దర్శకుడు మహి. యాత్ర సినిమా డీల్ చేసిన విధానం చూసి బన్నీ ఈ దర్శకుడికి ఫ్లాట్ అయిపోయాడు. ఈ సినిమా వైయస్ జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కబోతోందని తెలుస్తుంది. కాకపోతే జగన్ పేరు బయట పెట్టకుండా పొలిటికల్ సినిమాలా దీన్ని తీయాలని దర్శకుడు మహి ప్లాన్ చేస్తున్నాడు. 

సినిమాలో హీరో క్యారెక్టర్ జగన్ పాత్రను పోలి ఉంటుందని ప్రచారం జరుగుతుంది. అప్పటి వరకు తన ప్రపంచంలో ఉన్న హీరో.. ముఖ్యమంత్రిగా ఉన్న తండ్రి చనిపోతే వచ్చి  సొంతంగా రాజకీయంగా ఎలా ఎదిగాడు అనేదే ఈ సినిమా కథ అని తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ అయితే అల్లు అర్జున్ కెరీర్ లో తెరకెక్కబోయే తొలి రాజకీయ కథా చిత్రం ఇదే అవుతుంది. మరి చూడాలిక.. బన్నీ పొలిటికల్ ఎంట్రీ ఎలా ఉండబోతుందో..? 

More Related Stories