అకీరా నా బాధ్యత అంటున్న రామ్ చరణ్..

అకీరా నందన్.. ఈ పేరుకు తెలుగులో చాలా ఇమేజ్ ఉంది. దీనికి కారణం అతడు పవన్ కళ్యాణ్ కుమారుడు కావడమే. రేణుదేశాయ్, పవన్ దంపతుల పుత్రుడే అకీరా నందన్. ఈ కుర్రాడు ఇప్పుడు పూణేలో తల్లితో కలిసి ఉంటున్నాడు. మొన్నటి వరకు ఫోటోల్లో ఎప్పుడు కనిపించినా చిన్న పిల్లోడిలానే కనిపించాడు. కానీ ఈ మధ్య విడుదలవుతున్న ఫోటోలు చూస్తుంటే అమ్మో అనిపిస్తుంది. ఎంత ఎదిగిపోయావయ్యా అంటూ పాట పాడాల్సిన అవసరం వచ్చేలా కనిపిస్తుంది. వరుణ్ తేజ్ కూడా ఈయన ముందు పనికొచ్చేలా కనిపించడం లేదు. పవన్ ఫ్యాన్స్ లో ఈ ఫోటోలు ఎక్కడలేని జోష్ నింపుతుంది. నిన్నమొన్నటి వరకు చిన్న పిల్లాడిలా కనిపించిన అకీరా.. అప్పుడే ఇంత ఎదిగిపోయాడా అంటూ సంబరాలు చేసుకుంటున్నారు అభిమానులు.
పవన్ అతడికి ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు.. పేరు ఇచ్చాడు చాలు. రేపు ఫ్యూచర్ లో పవన్ కొడుకు అనే బ్రాండ్ తోనే అకీరా స్టార్ అయిపోయినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. అకీరా ఎదుగుదల చూస్తుంటే మరో మూడు నాలుగేళ్లలోనే హీరోగా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే ఆహార అడుగుల నాలుగు అంగుళాలు పెరిగిపోయాడు అకీరా. మరోవైపు పవన్ వారసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను రామ్ చరణ్ తీసుకుంటున్నాడనే ప్రచారం జోరుగా జరుగుతుంది. తన కొణిదెల బ్యానర్ లోనే తమ్ముడిని లాంఛ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు మెగా వారసుడు. దీనిపై త్వరలోనే పూర్తి క్లారిటీ కూడా రానుంది. కచ్చితంగా అకీరా ఎప్పుడొచ్చినా కూడా అది అన్నయ్య కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలోనే వస్తాడని తెలుస్తుంది. మరి అదెప్పుడు ఉంటుందో చూడాలిక.