English   

పవర్ స్టార్ చేస్తున్న తప్పే చేస్తోన్న చిరంజీవి...దెబ్బ తప్పదా

Chiranjeevi
2020-07-20 12:18:23

చిరంజీవి కథల విషయంలో పర్టిక్యులర్‌ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. అందుకే ఆయనకు సక్సెస్ రేట్ ఎక్కువగానే ఉంటుంది. కమర్షియల్‌ లెక్కలు, అభిమానుల అంచనాలు లేక్కేసుకుని అన్నీ సరితూగుతాయని అనుకుంటే తప్ప సినిమాలకి ఊరికే కమిట్ అయిపోడు. ఇప్పుడు కూడా ఆయన సినిమాల ఎంపిక అలానే ఉంటుంది. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో ఆచార్య చేస్తున్న చిరంజీవి నెక్ట్స్ సుజిత్‌ దర్శకత్వంలో 'లూసిఫర్' రీమేక్ చెయ్యబోతున్నాడు.

మోహన్‌లాల్‌, పృథ్వీరాజ్‌ కాంబినేషన్‌లో రూపొందిన 'లూసిఫర్' మాలీవుడ్‌ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ స్టోరీనే తెలుగు ప్రేక్షకుల ముందుకి వస్తోండగా మళయాళంలో మోహన్‌లాల్‌ పోషించిన పాత్రని ఇక్కడ చిరంజీవి ప్లే చెయ్యబోతున్నాడు. అయితే లూసిఫర్ సినిమాలో మోహన్‌ లాల్‌ క్యారెక్టర్‌కి జోడీ ఉండదు. ఎక్కడా కనీసం హీరోయిన్‌ ఫోటో కాదు కదా అసలు ఆ ఊసే ఎక్కడా వినిపించదు. పాలిటిక్స్‌, మాఫియా నేపధ్యంలో సాగే ఈ సినిమాలో చిరంజీవికి హీరోయిన్ ని పెడుతున్నారని ఒకసారి, అలా లేదని ఒకసారి ప్రచారం జరుగుతూ వస్తోంది. ఆ విషయం మీద క్లారిటీ లేకున్నా మెగా అభిమానులు మాత్రం కలవరపడుతున్నారు.

ఎందుకంటే మలయాళ 'లూసిఫర్' సూపర్ హిట్ అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ సినిమా రీమేక్ రైట్స్ రామ్ చరణ్ పోటీపడి మరీ కొన్నాడు. అయితే ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ 'లూసిఫర్' పేరుతో ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఇంటికే పరిమితమైన జనాలు ఇప్పటికే ఈ సినిమాని చాలా సార్లు చూసేసే ఉంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ అదే 'లూసిఫర్' సినిమాని చిరంజీవి తెలుగులో రీమేక్ చేస్తున్నారు. కధలో ఎన్ని మార్పులు చేర్పులు చేసినా ఆల్రెడీ ఆ సినిమా ప్రేక్షకులకి ఇంటరెస్ట్ కలుగుతుందా ? అంటే అనుమానమే. నిజానికి పవన్ కళ్యాణ్ కూడా ఇలానే ఆల్రెడీ థియేటర్స్ లో రిలీజైన సినిమా రీమేక్ చేసి ఫ్లాప్ మూట కట్టుకున్నాడు.

అజిత్ - తమన్నా జంటగా నటించిన తమిళ్ మూవీ వీరమ్ సినిమాని వీరుడొక్కడే పేరుతో తెలుగులో డబ్ చేసి విడుదల చేసారు. అయినా పవన్ కళ్యాణ్ డాలీ దర్శకత్వంలో 'కాటమరాయుడు' పేరుతో తెలుగులో రీమేక్ చేసి భారీ ఫ్లాప్ మూట కట్టుకున్నాడు. దీంతో పవర్ స్టార్ కి వచ్చిన రిజల్టే మెగాస్టార్ కి వస్తుందేమో అని మెగా ఫ్యాన్స్ భయ పడుతున్నారు. చిరంజీవి గతంలో ఠాగూర్, ఖైదీ నెం.150 అనే రీమేక్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నప్పటికీ అవి తెలుగులో అంతకముందు డబ్బింగ్ కాలేదు. కానీ లూసిఫర్ ఇప్పటికే తెలుగులో డబ్ అయింది. చూడాలి మరి ఏమవుతుందో ?

More Related Stories