English   

మళ్ళీ వార్తల్లోకి త్రిష పెళ్లి...ఈసారి ఆ హీరోతో 

 Trisha marriage
2020-07-20 16:04:43

చెన్నై చందమామ త్రిష టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది. దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించిన ఆమె తెలుగులో అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ కి వెళ్లి సెటిల్ అయింది. అక్కడే అడపాదడపా సినిమాలు చేసుకుంటూ కాలం వెళ్ళదీస్తోంది.  ఒక దశ లో తన కెరీర్ అయిపోయింది కాబట్టి పెళ్లి చేసుకోబోతుంది అనుకున్నారు.  వరుణ్ అనే బిజినెస్‌మ్యాన్‌ కం సినీ నిర్మాత‌తో త్రిష కొంతకాలం పాటు డేటింగ్ చేశారు. అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు వైపుల పెద్దలను ఒప్పించి చెన్నైలో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు త్రిష ప్రకటించారు. అయితే ఇప్పుడు త్రిష పెళ్ళికి సంబంధించి ఒక ఆసక్తికర వార్త హల్చల్ చేస్తోంది. 

అదేంటంటే త్వరలో హీరోయిన్ త్రిష పెళ్లిపీటలు ఎక్కనుందని అది కూడా హీరో శింబుని త్రిష పెళ్లిచేసుకోబోతోందంటు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. శింబు పెళ్లి విషయానికి వస్తే ఆయన నయనతారతో ప్రేమాయణం, హన్సికతో ప్రేమ, పెళ్లి వంటి వార్తలు వచ్చాయి. చివరి నిమిషంలోనే వీరి పెళ్లిళ్ళు కూడా క్యాన్సిల్ అయ్యాయి. మరి ఇప్పుడు ఈ పెళ్లి విషయంలో నిజం ఎంత ఉందొ తెలియదు కానీ కోలీవుడ్ మీడియాలో మాత్రం ఈ టాపిక్‌పై కథనాలు వెలువడుతున్నాయి. చివరిగా శింబు, త్రిష కలిసి ‘విన్నైతాండి వరువాయ’ (తెలుగులో 'ఏమాయ చేసావే' పేరిట డబ్ అయింది) సినిమాలో కలిసి నటించారు. ఈ మూవీ సీక్వెల్‌లో కూడా వీరు నటించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.  

More Related Stories