English   

అర్జున్ కూతురు ఐశ్వర్యకు కరోనా పాజిటివ్..

Actress Aishwarya Arjun
2020-07-20 16:19:19

కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది కోవిడ్ బారిన పడ్డారు. ఇప్పుడు మరొకరికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పటికే ఈ కుటుంబంలో అర్జున్ మేనల్లుడు ధృవ సర్జకు కరోనా పాజిటివ్ వచ్చింది. అతడి భార్యకు కూడా కరోనా నిర్ధారణ అయింది. ఇప్పుడు అదే కుటుంబంలో మరొకరు కూడా కరోనా బారిన పడ్డారు. అర్జున్ కూతురు ఐశ్వర్యకు కూడా కరోనా రావడంతో వెంటనే ఆమెను చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. అక్కడే ప్రముఖ డాక్టర్స్ ఆధ్వర్యంలో ఐశ్వర్యకు చికిత్స అందిస్తున్నారు. వీలైనంత త్వరగా ఆమె కోలుకోవాలని అభిమానులు కూడా ప్రార్థిస్తున్నారు. మరోవైపు ఐశ్వర్య కుటుంబ సభ్యులు కూడా కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు.

More Related Stories