వర్మ పరాన్నజీవి అంటూ నూతన్ నాయుడు సినిమా

రామ్ గోపాల్ వర్మ అంటేనే వివాదం, వివాదం అంతేనా వర్మ అన్నంతగా వర్మ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల పోస్టులు పెడుతూ అందరి నోళ్ళలో నానడమే గాక వివాదాలని కూడా అక్కడే రాజేస్తుంటారు వర్మ. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరినీ ఏదో రకంగా కెలుకుతూ ఉంటారాయన. కానీ, ఆయన జోలికి మాత్రం ఎవ్వరూ వెళ్లరు. కారణం, బురదలో రాయి వేస్తే అది మన మీదే పడుతుందని. అయితే కొందరు మాత్రం తెగించి ముందుకు వెళ్తారు అందులో ఒకరు జొన్నవిత్తుల. వీరిద్దరి మధ్య వివాదం జరగడంతో వర్మ మీద ఒక సినిమా చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కూడా వర్మ మీద పగ బట్టారు. దానికి కారణం ఆయన పవర్ స్టార్ అంటూ ఒక సినిమా చేస్తుండడమే.
ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ వర్మపై సినిమా చేయబోతున్నారు. అది కూడా సెటైరికల్ మూవీనే దాని పేరు ‘పరాన్న జీవి’. ‘రెక్లెస్ జెనిటిక్ వైరస్’ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా నిర్మిస్తున్నది పవన్ కళ్యాణ్ అభిమాని. 99 థియేటర్ బ్యానర్‌పై స్కై మీడియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న చిత్రానికి సీఎస్ అనే ఆయన నిర్మాత. డాక్టర్ నూతన్ నాయుడు దర్శకుడు. ఈయనెవరో కాదు ‘బిగ్ బాస్’ సీజన్ 2లో కంటెస్టెంట్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లను అధికారికంగా వెల్లడించనున్నారని అంటున్నారు. ‘పవర్ స్టార్’ అంటూ పవన్‌పై వర్మ సినిమా తీస్తుంటే.. ఆర్జీవీపై పవన్ అభిమాని ఓ సినిమా తీయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.