English   

వకీల్ సాబ్  మళ్ళీ వార్తల్లోకి ఆ హీరోయిన్ 

 Shruti Haasan
2020-07-20 17:41:42

రీ ఎంట్రీ తరువాత పవన్ చేస్తోన్న సినిమా వకీల్ సాబ్. పింక్‌ అనే బాలీవుడ్ సినిమాకి రీమేక్‌ అయిన ఈ సినిమా ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకోగా వేసవి కానుకగా మే 15న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే కరోనా దెబ్బకు ఆ ప్లాన్ అంతా పాడయింది కూడా అది వేరే విషయం. ఈ సినిమాలో అంజలి, నివేత థామస్, మల్లేశం హీరోయిన్ అనన్యలు నటిస్తున్నారు. అయితే వకీల్ సాబ్ సినిమా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ లో పవన్ కళ్యాణ్ భార్య పాత్రకి శృతి హాసన్ అని ప్రచారం జరిగింది.  అయితే ఆ విషయం మీద శ్రుతి క్లారిటీ ఇచ్చేసింది. ఆమె నటించడం లేదని. అయితే పవన్ భార్యగా ఇలియానాను ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్టుగా ప్రచారం అయింది. 

ఆ తర్వాత ఈ పాత్ర కోసం మిల్కీ బ్యూటీ తమన్నా పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చింది. ఇప్పటికే ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ చిత్రంలో తమన్నా, పవన్ కాంబినేషన్‌ సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్‌ మరోసారి సిల్వర్ స్ర్కీన్ మీద సందడి చేయనుందని టాక్‌ వినిపించింది. అయితే ఆ కీలక రోల్ కోసం శృతిహాసన్‌ నే ఫైనల్ చేసినట్టు చెబుతున్నారు.   క‌రోనా కార‌ణంగా ‘వ‌కీల్ సాబ్‌’ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి. ఇక దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బోని కపూర్ సమర్పిస్తున్నారు.

More Related Stories