English   

ఆ డైరెక్టర్ ని ఇంటికి పిలిపించి మరీ ట్రీట్ ఇచ్చిన చిరు

Chiranjeevi
2020-07-20 17:46:56

చిరంజీవి లాక్ డౌన్ ని బాగా వాడుకుంటున్నాడు. ఒక పక్క సినిమా జీవుల కష్టాలు తీరుస్తూనే తన సమయాన్ని మంచి సినిమాలు చూస్తూ మంచి స్టోరీస్ వింటూ గడిపేస్తున్నాడు. తాజగా ఆయన ఓ సినిమా చూసి ఇంప్రెస్ అయ్యాడు. అయితే ఇంప్రెస్ అయి ఊరుకోకుండా ఆ దర్శకుడిని ఇంటికి పిలిచి మరీ అభినందించారు. 2018లో సత్య దేవ్ కంచరాన హీరోగా వచ్చిన బ్లఫ్ మాస్టర్ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే చాలా కాలం తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. తన కుటుంబసభ్యులతో కలిసి సినిమాను వీక్షించిన చిరు చాలా ఇంప్రెస్‌ అయ్యాడట. వెంటనే డైరెక్టర్‌ గోపీ గణేశ్ ను తన దగ్గరకు పిలిపించుకొని మరీ అద్భుతమైన సినిమాను తీశావని ప్రశంసలు కురిపించాడని ఆ దర్శకుడు తన సోషల్ మీడియాలో చిరుతో దిగిన పిక్స్ షేర్ చేసుకున్నాడు. సత్యదేవ్‌, నందితా శ్వేత కాంబినేషన్‌ లో వచ్చిన ఈ సినిమాలో థియేటర్స్ లో పెద్దగా ఆడలేదు కానీ ఎప్పుడైతే యూట్యూబ్ లో రిలీజ్ అయిందో ఆనాటి నుండి ఈ సినిమా జనాల్లోకి బాగా వెళ్ళింది. మల్టీ లెవల్ స్కామ్స్ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికీ ఎవర్ గ్రీన్.

More Related Stories