English   

మళ్ళీ పోలీస్ రోల్ లో అలరించనున్న రాశీ

 Raashi Khanna
2020-07-21 09:24:16

కొందరు హీరోలకి కొన్ని రకాల పాత్రలు బాగా సూట్ అవుతుంటాయి. హీరోయిన్స్ విషయానికి వచ్చినా అంతే. అయితే దాదాపుగా హీరోయిన్స్ అంటే కాలేజ్ స్టూడెంట్ గానో, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గానో చూపిస్తారు. పోలీస్ లాంటి రోల్స్ చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి. అలా దొరికినప్పుడు వారు వెంటనే పట్టేస్తారు. ఇప్పుడు రాశి ఖన్నా కూడా ఆ పనే చేస్తోంది. రాశీఖన్నా మరో మారు లీస్ పాత్రలో కనిపించబోతోందట. తమిళ్ స్టార్ హీరో శింబుతో నటిస్తోన్న సినిమాలో ఆమె ఓ అండర్ కవర్ లో ఉన్న పోలీస్ గా నటిస్తోందట. నిజానికి ఆమెకు ఈ రోల్ కొత్తేమీ కాదు. ఇప్పటికే రాశీ కామెడీ పోలీస్ గా సుప్రీమ్ సినిమాలో నటించి, ఆ మూవీలో బెల్లం శ్రీదేవి పాత్రతో మాస్ ఆడియెన్స్ ని ఎంటర్ టైన్ చేసింది. ఇప్పుడు గ్లామరస్ పోలీస్ గా అలరించడానికి రెడీ అయిందని అంటున్నారు. ఇక ఇది కాక మరో సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. ఆ సినిమాలో కూడా ఈమెకు పోలీస్ ఆఫీసర్ పాత్రనే ఆఫర్ చేసినట్టు చెబుతున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రంలో రాశీకి పోలీస్ రోల్ ఆఫర్ చేసినట్టు చెబుతున్నారు. అంతేకాక ఈ సినిమా కోసం ఆమెకు ఏకంగా కోటి రూపాయలు దాకా పారితోషికం కూడా ఇస్తున్నారట.  

More Related Stories