English   

దీపికా పదుకొనేకు ప్రభాస్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారా..

 Deepika Padukone
2020-07-21 09:45:15

ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తిగా లవ్ స్టోరీ. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. మహానటితో సంచలన విజయం సాధించిన ఈయన రెండేళ్లకు పైగా కూర్చుని ఈ కథ రాసుకున్నాడు. సోషియో ఫాంటసీ జానర్‌లో ఈ సినిమా రాబోతుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ దాదాపు 250 కోట్లతో నిర్మించబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుందనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు దీపికా పదుకునే కన్ఫర్మ్ అయింది. దీనికి సాక్ష్యం కూడా వచ్చేసింది. మా సినిమాలో దీపికా పదుకునే నటిస్తోంది అంటూ వైజయంతి మూవీస్ అఫీషియల్ గా ఒక న్యూస్ విడుదల చేసింది. దానికి తోడు మొన్న దీపిక పదుకొనే తన సోషల్ మీడియా పేజీలో మహానటి సినిమాను అందరూ చూడండని పోస్ట్ పెట్టింది. 

సాధారణంగా తెలుగు సినిమాల వైపు కనీసం పట్టించుకోని బాలీవుడ్ హీరోయిన్లు అంత ప్రత్యేకంగా మహానటి సినిమాను పొగడటం ఏంటి.. పైగా దాన్ని చూడాలంటూ ప్రమోట్ చేయడమేంటి అనుకుంటున్నారు. దాని వెనక కారణం నాగ్ అశ్విన్, ప్రభాస్ సినిమానే. మహానటి సినిమాను తెరకెక్కించిన నాగ్ అశ్విన్ ఇప్పుడు ప్రభాస్ సినిమా చేస్తున్నాడు. ఆయన సినిమాలో దీపికను తీసుకున్నారు కాబట్టే తన దర్శకుడు సినిమాను ప్రమోట్ చేసింది. ఈ సినిమా కోసం దాదాపు 20 కోట్లకు పైగానే పారితోషకం అందుకుంటుంది దీపికా పదుకొనే. దాంతో పాటు మళ్ళీ రైట్స్ లో కూడా వాటా కావాలని కండిషన్ పెట్టినట్లు తెలుస్తుంది. 

ప్రభాస్ తో సమానంగా లేదంటే ఆయన కంటే ఎక్కువగా దీపిక అందుకుంటుందని ప్రచారం భారీగానే జరుగుతుంది. దీపికా పదుకొనే ఉంటే  బాలీవుడ్లో సినిమాకు ప్రమోషన్ ఎక్కువగా వస్తుందని దర్శకుడు నాగ్ అశ్విన్ భావిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు సీక్వెల్ అనే ప్రచారం జరుగుతుంది. దేవకన్యకు, మానవుడికి పుట్టిన బిడ్డగా ఈ చిత్రంలో ప్రభాస్ నటించబోతున్నాడని తెలుస్తుంది. అతీత శక్తులున్న వాడిగా ప్రభాస్ పాత్ర ఉండబోతుంది. మొత్తానికి చూడాలిక.. ఈ చిత్రం ఎలా ఉండబోతుందో.. దీపిక తెలుగు ఎంట్రీ ఎలా మారబోతుందో..?

More Related Stories