English   

సుశాంత్ సింగ్‌కు ఘన నివాళి అర్పిస్తున్న మాజీ ప్రేయసి..

Ankita Lokhande
2020-07-21 18:02:11

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం మరిచిపోవడం అంత ఈజీ కాదు. ఆయన కుటుంబాన్ని మాత్రమే కాదు కోట్లాది మంది అభిమానుల హృదయాలను కూడా ఈయన చావు ఎంతో బాధ పెట్టింది. అందుకే నెల రోజులు అయిపోయినా కూడా ఇప్పటికీ ఆయన ధ్యాసలోనే ఉన్నారు. ఇప్పటికే కొందరు అభిమానులు ఆయన మరణంపై వివరణ కోరుతుండగా.. సూసైడ్ ఆర్ మర్డర్ అంటూ ఓ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు బాలీవుడ్ లో ఓ నిర్మాత. ఇదిలా ఉంటే ఇప్పుడు సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి అంకిత లోఖండే కూడా తను మనసిచ్చిన వాడికి ఘనమైన నివాళి ఇవ్వాలని చూస్తుంది. సుశాంత్ హీరో కాక ముందు పవిత్ర రిష్ట సీరియల్ లో నటించాడు. అది అప్పట్లో సంచలనం.. హీరోలతో సమానంగా ఈయనకు క్రేజ్ ఉండేది. ఆ తర్వాత కాయ్ పో చే సినిమాతో హీరో అయ్యాడు. సుశాంత్ ఆత్మహత్య తర్వాత పవిత్ర రిష్ట గురించి చర్చ జరుగుతుంది.

ఆ సీరియల్ లో సుశాంత్ తో అంకిత లోఖండే నటించింది. ఆ సమయంలో ఇద్దరి మద్య పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ దాదాపు ఆరేళ్ల పాటు సహజీవనం కూడా చేసారు. కొన్ని కారణాలతో బ్రేకప్ అయినా కూడా స్నేహితులుగా ఉన్నారు. ఇప్పుడు సుశాంత్ సింగ్ మరణాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతుంది. అందుకే తన మాజీ ప్రియుడికి ఘన నివాళి అర్పించాలంటే పవిత్ర రిష్ట సీజన్ 2 మొదలు పెట్టాలని భావిస్తుంది అంకిత. ఇదే ప్రపోజల్ నిర్మాత ఏక్తా కపూర్ దగ్గరికి కూడా తీసుకెళ్లింది అంకిత. దానికి ఆమె కూడా ఓకే చెప్పడంతో కథ సిద్ధం చేసే పనుల్లో బిజీ అయ్యారు టీం. పవిత్ర రిష్ట 2 లో అంకిత లోంఖడే కీలక పాత్రలో నటించేందుకు సిద్దంగా ఉంది.. మరోవైపు సుశాంత్ స్థానంలో ఎవరు నటిస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఈ సీజన్ కానీ మొదలైతే కచ్చితంగా సుశాంత్ అందరికీ మరింత గుర్తు రావడం ఖాయం. 

More Related Stories