English   

నువ్వేమైనా పతివ్రతవా.. లైవ్‌లో కొట్టుకున్న హీరోయిన్స్..

 Vanitha Vijaykumar
2020-07-22 07:50:19

ఈ రోజుల్లో లైవ్ అంటే ఓ విషయంపై మాట్లాడుకునేది కాదు పోట్లాడుకునేది. ఇప్పుడు ఇలాగే మారిపోయాయి అన్ని. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తాజాగా తమిళ నటుడు విజయ్ కుమార్ కూతురు వనిత విజయ్ కుమార్ మూడో పెళ్లి వివాదాస్పదంగా మారింది. ఈమె పెళ్లి జరిగి నెల రోజులు కావొస్తున్నా కూడా ఇప్పటికీ రచ్చ జరుగుతూనే ఉంది. సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానెల్, టెలివిజన్ ఛానెల్స్‌ ఎక్కడా చూసినా కూడా వనిత గురించి టాపిక్ నడుస్తూనే ఉంది. ఇప్పటికే ఈ విషయంపై సీనియర్ హీరోయిన్స్ లక్ష్మీ రామకృష్ణన్, కుట్టి పద్మిని, కస్తూరి శంకర్ లాంటి వాళ్లు వనితకు చెప్పడానికి చూసారు. అయితే వాళ్ల మాటలను వనిత కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. నాకు చెప్పేకంటే ముందు మీది మీరు చూసుకోండి.. మీ జీవితాలు కూడా ఎప్పుడో నాశనం అయిపోయాయి.. మీరొచ్చి ఇప్పుడు నాకు చెప్పాల్సిన అవసరం లేదంటూ రెచ్చిపోయింది.

తాజాగా లక్ష్మీ రామకృష్ణన్, వనిత ఇద్దరూ లైవ్ చర్చకు వచ్చారు. అక్కడ ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. లక్ష్మీ రామకృష్ణన్ ను మాట్లాడనీయకుండా వనిత రెచ్చిపోయింది. అసలు నా పెళ్లితో మీకు వచ్చిన ఇబ్బందేంటో అర్థం కావడం లేదు.. నా యిష్టం.. ఇది నా జీవితం అంటూ ప్రశ్నించింది. గతంలో తాను ఏవో కారణాల వల్ల విడాకులు ఇచ్చానని.. అలాంటిది మీరెవరు నన్ను ప్రశ్నించడానికి.. తనను పట్టడానికి అంటూ రెచ్చిపోయింది. నువ్వేమైనా మద్రాస్ హైకోర్టు జడ్జ్ అనుకుంటున్నావా అంటూ ఫైర్ అయ్యింది వనిత . ఒక్క భర్తతో సంసారం చేసినంత మాత్రాన నువ్వు ఏమైనా పతివ్రతవు అనుకుంటున్నావా అంటూ సంచలన ప్రశ్నలసు సంధించింది. తన భర్తలతో కలిసి ఉన్నప్పుడు నీతిగా, నిజాయితీగా ఉన్నానని.. నీ మాదిరిగా భర్తను మోసం చేయలేదంటూ లక్ష్మీ రామకృష్ణన్‌పై నిప్పులు చెరిగింది వనిత. ఇద్దరం ఒకే ఇండస్ట్రీలోనే ఉన్నాం.. నీ గురించి నాకు బాగా తెలుసు అంటూ ఫైర్ అయిపోయింది వనిత. మొత్తానికి ఈ చర్చతో తమిళ మీడియా అంతా ఒక్కసారిగా వేడెక్కిపోయింది. 

More Related Stories