English   

తాత కాబోతున్న స్టార్ హీరో విక్రమ్

 Vikram
2020-07-22 11:05:49

తమిళ్ స్టార్ హీరో విక్రమ్‌ త్వరలో తాత కాబోతున్నాడు. ఇదేంట్రా అనుకుంటున్నారా ? నిజమేనండీ వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమే. అయితే ఆయన కొడుకు వల్ల కాదు అండోయ్. ఆయన కుమార్తె అక్షిత త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. విక్రమ్‌-శైలజ దంపతులకు కుమార్తె అక్షిత, కుమారుడు ధ్రువ్‌ ఉన్నారు. కొడుకు ధృవ్ ను హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న విక్రమ్ అక్షితకు మాత్రం మను రంజిత్‌ అనే కుర్రాడితో 2017లో వివాహం జరిపించాడు. ఇప్పుడు ఆ జంట తల్లితండ్రులు కాబోతున్నారు. అంటే విక్రమ్ తాత కాబోతున్నాడన్న మాట. ఇక విక్రమ్‌, శైలజ దంపతులు అమ్మమ్మా తాతలు కానునుండంతో.. వారి కుటుంబంలో ఆనందం నెలకొంది. ఇక వారింట్లో త్వరలో సీమంతం ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు, కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో.. ఈ వేడుకను చాలా సింపుల్‌గా కుటుంబ సభ్యుల మధ్య సెలబ్రేట్‌ చేసుకోనున్నట్టుగా తెలుస్తోంది. 
 

More Related Stories