English   

వర్మ చరిత్రకి దెబ్బ...పవర్ స్టార్ ట్రైలర్ లీక్

Ram gopal varma
2020-07-22 11:16:56

వర్మ రచ్చ రోజురోజుకీ పెరిగిపోతోంది. లాక్‌డౌన్‌లో కూడా బూతు సినిమాలు చేసి డబ్బులు సంపాదించుకున్న వర్మ ఇప్పుడు పవన్ మీద పడ్డారు. ఇప్పటికే క్లైమాక్స్, నేక్డ్ అంటూ పోర్న్ సినిమాలకు తక్కువ కానీ కంటెంట్ ఆన్‌లైన్‌లో విడుదల చేసి సొమ్ము చేసుకున్న వర్మ మియా మాల్కోవాతో ‘క్లైమాక్స్’ అనే బూతు సినిమాకు 100 రూపాయలు టికెట్ పెట్టాడు.. ఆ తర్వాత ‘నేక్డ్’ అనే మరో లోకల్ బూతు సినిమాకు 200 రూపాయలు టికెట్ పెట్టాడు. ఇప్పుడు ఆయన పవర్ స్టార్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న నేపధ్యంలో ఈ సినిమా ట్రైలర్ కు కూడా రేటు నిర్ణయించారు. రూ.25 చెల్లిస్తేనే ట్రైలర్ చూసే వీలుంటుందని స్పష్టం చేశారు.

చరిత్రలో ఇలాంటి విధానం తొలిసారి అని ఆయన ఘనంగా ప్రకటించుకున్నారు. పాతిక రూపాయలు కేవలం ట్రైలర్ కోసమేనని, సినిమా మొత్తం చూడాలంటే మరో రేటు ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ఈ ట్రైలర్ ఈరోజు 11 ఇంటికి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఆ ట్రైలర్ ఆన్ లైన్ లో లీకయింది. దీంతో వర్మ ఈ విషయం మీద స్పందించారు. ట్రైలర్ లీకయిందని, అది తమ ఆఫీస్ స్టాఫ్ ఎవరో చేసి ఉంటారని వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చాడు. ఇక ట్రైలర్ కోసం డబ్బు కట్టిన వారికి రీఫండ్ చేస్తానని చెప్పుకొచ్చాడు వర్మ. 

More Related Stories