తెలుగు సినిమాలు వదులుకున్నానని బాధపడుతోన్న జాన్వీ

హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ కంబినేషన్లో ఫైటర్ అనే సినిమా చేస్తున్నారు. విజయ్ బాక్సర్ గా కనిపించనున్న ఈ సినిమా ద్వారా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయిక గా టాలీవుడ్ కు పరిచయం అవబోతోందని ఆ మధ్య ప్రచారం జరిగింది. ఇక ఈ సినిమాకి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ సహ నిర్మాత గా జాయిన్ కావడంతో, ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రూపొందించనున్నారని అన్నారు. జాన్వీ సినిమాల బాద్యతలు కరణ్ చూసుకుంటున్నారు కాబట్టి ఆమె ఈ సినిమాలో నటించడం దాదాపు ఖాయమనే అనుకున్నారు. అయితే ఆమె చేయనని చెప్పడంతో అనన్య పాండేని తీసుకుని షూట్ కూడా చాలా వరకూ తీశారు.
అయితే ఆమెకున్న బిజీ షెడ్యూల్ వలన ఫైటర్ సినిమాకి డేట్స్ కేటాయించ లేక పోతుందని అందుకే ఈ సినిమా నుండి తప్పుకుంటుందని అన్నా ఇప్పుడు మాత్రం ఈ సినిమా వదిలేసుకున్నందుకు బాధ పడుతోందట ఆమె. ఎందుకంటే ఆమె చేసిన బాలీవుడ్ చిత్రాలన్నీ థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల అవుతున్నాయి. వెండితెర మీద తన తల్లిలా వైభవాన్ని చూసుకోవాలనుకున్న ఆమె కోరిక వాటి వలన నెరవేరలేదని ఆమె బాధ పడుతోందట. టాలీవుడ్ నుంచి వచ్చిన ఆఫర్లను ఎందుకు వదులుకున్నానా? అని ఇప్పుడు బాధ పడుతోందట జాన్వీ కపూర్.