English   

నలభై దాటినా పెళ్లి మాటెత్తని హీరోయిన్స్...లవ్ ఫెయిల్యూర్ ఏ కారణమా

Tabu Nagma
2020-07-22 17:43:38

పెళ్లి అనేది మనుషుల జీవితాల్లో ఒక భాగం. మిగతా ఎన్ని విషయాల్లో లాజిక్ లు మాట్లాడినా ఎవరైనా ఈ బంధంలోకి అడుగు పెట్టాల్సిందే. కానీ ఒక్కోసారి కొందరి విషయాల్లో మాత్రం ఇది ఫెయిల్ అవుతూ ఉంటుంది. కొంత మంది ప్రేమ విఫలం అయ్యో లేక ఈ వివాహ బంధం మీద నమ్మకం లేకనో జీవితంలో పెళ్లి లేకుండా ఉండిపోతుంటారు. ఇలాంటి వాళ్ళు నిజజీవితంలో మనకి చాలా మంది తారస పడుతుంటారు.

కానీ వారి గురించి మాట్లాడేది ఏముంటుంది ? అయితే మన హీరోయిన్స్ కొందరి విషయానికి వస్తే వాళ్ళు వయసు ముదిరిపోతున్నా ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోలేదు. అయితే వారి లిస్టు ఒకసారి పరిశీలిస్తే వారందరిదీ ఒకటే కామన్ పాయింట్. అదే లవ్ ఫెయిల్యూర్. ఇక మన ఇండస్ట్రీకి చెందిన వారి గురించి చూస్తే టబు, నగ్మా, శోభన, సితార, కౌసల్య, క‌త్రినా కైఫ్ లు ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోలేదు. వీరు ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకోలేదు అనేది ఒకసారి పరిశీలిస్తే.

టబు:
48 ఏళ్ల టబు ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు.! ట‌బు పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం నాగార్జున‌తో ప్రేమ వ్య‌వ‌హార‌మే కార‌ణ‌మ‌ని టాక్!
నగ్మా:
45 ఏళ్ల  నగ్మా ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. క్రికెటర్ గంగూలితో ప్రేమ విఫలం, తర్వాత నటుడు శరత్ కుమార్ తో ప్రేమ విఫలం కావడంతో ఆమె ఇక పెళ్లి జోలికి పోలేదు.
శోభన:
50 ఏళ్ల శోభన చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి వచ్చింది. ఇప్పటికీ పెళ్లి చేసుకొని ఈమెకు కూడా ఎవరో ఒకరితో బ్రేకప్ అయి ఉంటుందని అంటుంటారు. కానీ నిజానిజాలు దేవుడికెరుక. ఈమె ఓ పాపను దత్తత తీసుకుని పెంచుకుంటుంది.
సితార:
47 ఏళ్ల సితార ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉంది. సహనటుడు మురళితో ప్రేమ విఫలమవడమే సితార ఒంటరిగా ఉండిపోవడానికి కారణమని చెప్తారు. ఈయన ఎవరో కాదు గద్దల కొండ గణేశ్ చిత్రంలో నటించిన అధర్వ మురళి తండ్రి.
కౌసల్య:
40 ఏళ్ళ కౌసల్య కూడా ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు.  

More Related Stories