English   

బిగ్ బాస్ లోకి తరుణ్...క్లారిటీ ఇచ్చేశారుగా 

Tarun
2020-07-22 17:55:30

దక్షిణాది అన్ని భాషల్లో బిగ్ బాస్ రియాలిటీ షో సక్సెస్‌ అయింది. ఈ రియాలిటీ షో తెలుగులో కూడా ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ ఏడాది మళ్ళీ నాలుగో సీజన్ కి రెడీ అవుతోంది. మొదటి సీజన్ ని ఎన్టీఆర్ నడిపించగా, రెండో సీజన్ ని నాని నడిపించాడు, ఇక మూడో సీజన్ నాగార్జున నడిపి అందరి మన్ననలను అందుకున్నారు. ఇక ఈ ఏడాది నాలుగో సీజన్ కి ముందు నుంచే నిర్వాహకులు సన్నాహాలు మొదలు పెట్టారని ప్రచారం జరిగింది నాగార్జున ఒక వర్గం మన్ననలను అయితే అందుకున్నారు కానీ టీఆర్పీలు కానీ తెచ్చుకోలేక పోయారు. అందుకే అయితే ఈ సారి హోస్ట్‌ విషయంలో బిగ్‌బాస్‌ బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది టీం.

ఇక కరోనా కారణంగా అసలు ఉంటుందా ఉండదా ? అనే అనుమానాన్ని టీజర్ తో తుడిపేశారు. అయితే కంటెస్టంట్ లు అంటూ కొంత మంది పేర్లు కూడా ప్రచారం జరుగుతున్నాయి. అందులో ఒకప్పటి హీరో తరుణ్ పేరు కూడా వినిపించింది. అయితే అందుతున్న సమాచారం మేరకు ఇవ‌న్నీ అవాస్త‌వాల‌ని త‌రుణ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో ఖండించారు. "గ‌త కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాల్లో, కొన్ని దిన ప‌త్రిక‌ల్లో నేను బిగ్‌బాస్‌లో పాల్గొంటాన‌ని వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వం. బిగ్ బాస్‌లో పాల్గొనే ఆలోచ‌న కానీ, ఉద్దేశ్యం కానీ నాకు ఏమాత్రం లేదు. ఎప్ప‌టికీ క‌ల‌గ‌దు అని ఫైన‌ల్‌గా అంద‌రికీ స్ప‌ష్టం చేస్తున్నాను. ఇవి కేవ‌లం వ‌దంతులు మాత్ర‌మే. ద‌య‌చేసి త‌ప్పుడు వార్త‌ల‌ని ప్ర‌చాయం చేయొద్దు" అని త‌రుణ్ ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.  

More Related Stories