చరణ్ గట్టి ప్లాన్...అందుకే వెంకీతో సినిమా

ఛలో, భీష్మ సినిమాలు తీసి వరుస హిట్స్ అందుకున్న వెంకీ కుడుముల తన తదుపరి చిత్రం రామ్‌చరణ్‌తో చేయడానికి రెడీ అయ్యాడని ప్రహచారం జరుగుతోంది. ఇటీవల వెంకీ వినిపించిన కథకు చరణ్ ఫిదా అయ్యాడని అంటున్నారు. నిజానికి ఒకరకంగా కరోనా అన్నిపనులను ఆపేసినా మరో రకంగా అందరికీ రెస్ట్ ఇస్తుందని చెప్పాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హెచ్చరికల నేపధ్యంలో తెలుగు సినిమాల షూటింగ్స్ క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. చిరంజీవి ఆ సముయంలో మంచి సినిమాలు చూస్తున్నాడు. చూడలేకపోయిన మంచి సినిమాలు అన్నీ కవర్ చేస్తున్నారు. ఆ మధ్య చిరంజీవి భీష్మ సినిమాని దర్శకుడు వెంకీ కుడుములతో కలిసి వీక్షించాడు.
సినిమా బాగా నచ్చి చరణ్ ఒక లైన రెడీ చేసుకోమని చెప్పాడట. దీంతో ఆయన అప్పుడే ఒక లైన్ రెడీ చేసుకుని చరణ్ కి చెప్పడం, అది చరణ్ కి నచ్చడం జరిగిపోయిందని అంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్లో నటిస్తున్న చరణ్ ఆ తదుపరి లైటర్‌వెయిన్ ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకుని వెంకీ చెప్పిన కథ అయితే అందుకు పర్ఫెక్ట్గా వుంటుందని మరో ఆలోచన లేకుండా వెంకీ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడని అంటున్నారు.