English   

నితిన్ షాలిని పెళ్లి పనులు ప్రారంభం

 Nithiin
2020-07-23 08:42:38

నితిన్ షాలిని పెళ్లి పనులు ఆయన స్వగృహంలో వైభవంగా మొదలయ్యాయి. ఇరువురి కుటుంబాలు పెళ్లి కార్యక్రమాలతో హడావిడిగా ఉన్నారు. తాజాగా నితిన్ షాలిని నిశ్చితార్థ వేడుక కొందరు సన్నిహితుల మధ్య జరిగింది. షాలినికి ఎంగేజ్మెంట్ రింగ్ తొడుగుతున్న ఫొటోను హీరో నితిన్ తన ట్విట్టర్లో ఇటీవల షేర్ చేశాడు. నితిన్ షాలిని కుటంబాల పెద్దలు నిశ్చయ తాంబూళాలు మార్చుకున్న తర్వాత నిశ్చితార్థ వేడుక నిర్వహించారట.   అయితే వీరి పెళ్లి ఈనెల 26న ఫలక్నుమా ప్యాలస్ లో జరగనుంది. రాత్రి 8:30 గంటలకు కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఒక్కటి కానున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ పెళ్లిని చాలా సింపుల్గా నిర్వహించాలని నిర్ణయించారు.  వీరి పెళ్లికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ హాజరుకానున్నట్లు సమాచారం. ఇటీవల నితిన్ స్వయంగా ప్రగతి భవన్ వెళ్లి కేసీఆర్  శుభలేఖ అందజేసిన విషయం తెలిసిందే. 

More Related Stories