English   

ఓటీటీ బాటలో దట్ ఈజ్ మహాలక్ష్మి

 Tamannaah
2020-07-23 09:12:47

మిల్కీ బ్యూటీ తమన్నా  నటించిన 'దట్ ఈజ్ మహాలక్ష్మి'  బాలీవుడ్ మూవీ 'క్వీన్' చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది. ఈ మూవీని త్వరలో ఓటీటీలో విడుదలకు చేసేందుకు చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. రెండు సంవత్సరాల క్రితం విడుదలవ్వాల్సిన ఈ మూవీ కొన్ని అనివార్య కారణాల వల్ల రిలీజ్ కాస్తా లేట్ అయింది. అయితే ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ మధ్య రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలన్నీ ఓటీటీ బాట పడుతుండటంతో 'దట్ ఈజ్ మహాలక్ష్మి' ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారట. అందుకోసం ఇప్పటికే ప్రముఖ ఓటీటీలతో చర్చలు జరుపుతున్నారట. మంచి డీల్ కుదిరితే త్వరలోనే ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయడానికి సన్నాహకాలు జరుగున్నాయట. ఈ సినిమాని ముందుగా నీలకంఠ దర్శకత్వంలో స్టార్ట్ చేసారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆయన ప్రాజెక్టు నుండి తప్పుకోవడంతో  ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు.

More Related Stories