English   

మన ఇండస్ట్రీలో హీరోలను అల్లుళ్ళు చేసుకుంది వీరే 

chiranjeevi
2020-07-23 12:57:20

సినిమా ఇండస్ట్రీలో బంధుత్వం అనేది కొత్త కాదు. అయితే కొందరు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే వారు ఎదుగుతారు అని భావించి సీనియర్స్ వాళ్ళని అల్లుళ్ళని చేసుకున్నారు. ఈరోజు అలా ఎవరెవరు చేసుకున్నారు అనేది చూద్దాం.

అల్లు - చిరు :
అల్లు రామలింగయ్య కూతురయిన సురేఖని వివాహం చేసుకొని అల్లుడయ్యాడు చిరంజీవి.  
రజనీకాంత్ -ధనుష్ :
రజనీకాంత్ పెద్ద కూతురయిన ఐశ్వర్యని ధనుష్ పెళ్లి చేసుకున్నాడు.
శ్రీజ - కళ్యాణ్ దేవ్ :
చిరంజీవి చిన్న కూతురు శ్రీజను ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడైన కళ్యాణ్ దేవ్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఈయన హీరో అయ్యారు.
నాగార్జున - రామానాయుడు
ప్రముఖ నిర్మాత రామానాయుడు కుమార్తెను నాగార్జున పెళ్లి చేసుకున్నారు. అయితే విభేదాలతో వారు విడిపోయారు. వీరికి జన్మించిన వాడే నాగ చైతన్య.
కృష్ణ - సుధీర్ బాబు
సూపర్ స్టార్ కృష్ణ కూతురు ప్రియదర్శినిని పెళ్లి చేసుకున్న సుధీర్ ఆ తర్వాత రోజుల్లో హీరోగా స్థిరపడ్డారు.
అశ్వినీదత్ - నాగ్ అశ్విన్ :
ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కూతురు ప్రియాంకను డైరెక్టర్ నాగ అశ్విన్ ప్రేమించి పెళ్లి చేసుకకున్నారు.
ప్రకాష్ రాజ్ - సీఎల్ ఆనందన్  
తమిళ, మలయాళం హీరో, నిర్మాత అయిన సీఎల్ ఆనందన్ పెద్ద కుమార్తె అయిన లలిత కుమారి ని ప్రకాష్ రాజు పెళ్లి చేసుకుని తర్వాత విడాకులు ఇచ్చాడు. అలా సీఎల్ ఆనందన్ కి ప్రకాష్ రాజ్ అల్లుడు అయ్యాడు.
శ్రీహరి - సీఎల్ ఆనందన్  
తమిళ, మలయాళం హీరో, నిర్మాత అయిన సీఎల్ ఆనందన్ చిన్న కుమార్తె అయిన డిస్కో శాంతిని రియల్ స్టార్ శ్రీహరి పెళ్లి చేసుకున్నారు. అలా సీఎల్ ఆనందన్ కి శ్రీహరి అల్లుడు అయ్యాడు.
మోహన్ లాల్ - బాలాజీ  
ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ ప్రముఖ నిర్మాత అయిన కే. బాలాజీ కుమార్తె సుచిత్ర ని పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా తన తండ్రి లాగానే నిర్మాత. ఈమె వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటుంది.
శరత్ కుమార్  - రాజగోపాలన్ రాధాకృష్ణన్
సీనియర్ హీరోయిన్ రాధిక రాధిక శరత్ కుమార్ ని పెళ్లి చేసుకుంది. దీంతో శరత్ కుమార్ నటుడు రాజకీయవేత్తయిన మద్రాస్ రాజగోపాలన్ రాధాకృష్ణన్ అల్లుడు అయ్యాడు.
రాంకీ - రాజగోపాలన్ రాధాకృష్ణన్
సీనియర్ హీరోయిన్ నిరోషా రాంకీ అని పిలవబడే రామకృష్ణన్ ని సంవత్సరంలో పెళ్లి చేసుకుంది. నిరోషా రాధా ప్రముఖ నటుడు రాజకీయవేత్తయిన మద్రాస్ రాజగోపాలన్ రాధాకృష్ణన్ రెండో కుమార్తె కాగా అతనికి రాంకీ రెండో అల్లుడు అయ్యాడు.  

More Related Stories